Dhanush: 20 ఏళ్ల కష్టార్జితమే పోయెస్‌ గార్డెన్‌ ఇల్లు

ABN , Publish Date - Jul 09 , 2024 | 09:27 AM

చెన్నై నగరంలోని పోయెస్‌ గార్డెన్‌లో తాను కొత్తగా నిర్మించుకున్న ఇల్లు 20 ఏళ్ల కష్టార్జితమని హీరో ధనుష్‌ చెప్పారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘రాయన్‌’. ఈ నెలాఖరులో విడుదలకానుంది. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని తాజాగా చెన్నై నగరంలో నిర్వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్‌ పతాకంపై కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.

Hero Dhanush

చెన్నై నగరంలోని పోయెస్‌ గార్డెన్‌లో తాను కొత్తగా నిర్మించుకున్న ఇల్లు 20 ఏళ్ల (Dhanush Poes Garden House) కష్టార్జితమని హీరో ధనుష్‌ (Hero Dhanush) చెప్పారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘రాయన్‌’ (Raayan). ఈ నెలాఖరులో విడుదలకానుంది. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని తాజాగా చెన్నై నగరంలో నిర్వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్‌ పతాకంపై కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం సమకూర్చారు.

Also Read- Siddharth: మారని సిద్ధార్థ్, ఓవర్ యాక్టింగ్ చేస్తూ తెలుగు మీడియాపై సెటైర్లు


ఈ చిత్ర ఆడియో రిలీజ్‌ వేడుకలో హీరో ధనుష్‌ మాట్లాడుతూ.. ‘‘పోయెస్‌ గార్డెన్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ఇంటిని చూడాలని చిన్నప్పటి నుంచే కోరిక ఉండేది. అపుడే పోయెస్‌ గార్డెన్‌లో ఒక చిన్న ఇల్లు కొనుగోలు చేయాలని ఆశపడ్డాను. 16 యేటలోనే ‘తుల్లువదో ఇళమై’ అనే సినిమాలో నటించాను. ఆ సినిమా హిట్‌ కాకుండా ఉండివుంటే నేను ఎక్కడ ఉండేవాడినో నాకే తెలియదు. దాదాపు 20 యేళ్ళ తర్వాత కఠోర శ్రమకు లభించిన బహుమతే ఈ పోయెస్‌ గార్డెన్‌ ఇల్లు. పైగా, నేనేంటో నాకు బాగా తెలుసు. నన్ను పుట్టించిన ఆ శివుడికి తెలుసు. నా తల్లిదండ్రులకు తెలుసు. నా బిడ్డలకు తెలుసు. కెరీర్‌ ఆరంభం నుంచి పొదుపు చేసే అలవాటుంది. అనవసరపు వివాదాలు, వెన్నుపోట్లు, చెడ్డపేరు ఇలా అనేక సంఘటనలు జరిగినప్పటికీ ఇపుడు ఇలా మీ ముందు నిలబడివున్నానంటే కారణం నా అభిమానులే. (Raayan Audio Launch)


Raayan.jpg

సినిమా విషయానికి వస్తే.. ఇదొక వైవిధ్యభరిత చిత్రం. ఖచ్చితంగా నా కెరీర్‌లో మంచి విజయాన్ని అందుకుంటుందని.. అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో కష్టపడ్డారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జూలై 26న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది’’ అని పేర్కొన్నారు. కాగా, చెన్నై పోయెస్‌ గార్డెన్‌లో ఇటీవల ధనుష్ రూ. 150 కోట్లతో ఓ భవనాన్ని నిర్మించుకున్న విషయం తెలిసిందే. (Dhanush About His Rs. 150 Crore House)

Read Latest Cinema News

Updated Date - Jul 09 , 2024 | 09:27 AM

Dhanush 50: ధనుష్ 50వ చిత్రం ప్రత్యేకత ఏంటో తెలుసా?  

Dhanush: గృహ ప్రవేశం చేసిన ధనుష్.. ఇంటి ధర తెలిస్తే అవాక్కే..

Dhanush: సోషల్‌ మీడియాతో జర జాగ్రత్త!

Dhanush: సోషల్ ఇష్యూతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘సార్’

Dhanush 51: అటు కోలీవుడ్‌ స్టార్‌... టాలీవుడ్‌ కింగ్‌