Radhika Sarathkumar: స్టార్స్ మాట్లాడితే బాధితులకు భరోసా
ABN , Publish Date - Sep 03 , 2024 | 08:39 PM
హేమ కమిటీ ఇచ్చిన నివేదిక (Hema Committee) మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అగ్రనటీనటులు మాట్లాడకపోవడంపై రాధిక శరత్‌కుమార్ (Radhika Sarathkumar) తప్పుబట్టారు.
హేమ కమిటీ ఇచ్చిన నివేదిక (Hema Committee) మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అగ్రనటీనటులు మాట్లాడకపోవడంపై రాధిక శరత్‌కుమార్ (Radhika Sarathkumar) తప్పుబట్టారు. బాధిత మహిళల తరపున మాట్లాడాలని తన భర్త శరత్‌కుమార్‌కు చెప్పినట్లు ఆమె తెలిపారు. ‘‘వేధింపులకు గురైన మహిళల విషయంలో స్టార్స్ మాట్లాడే (Star Heros) మాటలు ఎంతో భరోసానిస్తాయి. అగ్రనటులు దీనిపై స్పందించాలని నాభర్తకు చెప్పాను. బాధిత మహిళలకు అండగా మాట్లాడాలని అడిగాను’’ అని రాధిక అన్నారు.
హేమ కమిటీ రిపోర్ట్‌పై రాధిక స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ర్టీల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. కొంతమంది వ్యక్తులు నటీమణుల కారవాన్‌లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలున్నాయని ఆమె ఆరోపించారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం తన దగ్గర వివరాలు తీసుకుందని చెప్పారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. ఇప్పటికే హేమ కమిటీ నివేదికపై ప్రముఖ నటులు మమ్ముట్టి, మోహన్‌లాల్ స్పందించారు. షూటింగ్ ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కలిగించేందుకు నివేదికలో చేసిన సూచనలను స్వాగతిస్తున్నానని మమ్ముట్టి అన్నారు. హేమ కమిటీకి సంబంధించిన ప్రతి ప్రశ్నకు మొత్తం సినీపరిశ్రమ సమాధానం చెప్పాలని నటుడు మోహన్‌లాల్ పేర్కొన్నారు.