Double Ismart OTT: ఏంటి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ఓటీటీలోకి వచ్చేసిందా.. ఇదేం ట్విస్ట్?

ABN , Publish Date - Sep 05 , 2024 | 11:01 AM

ఉస్తాద్ రామ్ పోతినేని, డైరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చి.. మిక్స్‌డ్ స్పందనను రాబట్టుకుంది. దీంతో ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తుందనేలా ఇప్పటికే వార్తలు హల్‌చల్ చేస్తుండగా.. సడెన్‌గా ఓటీటీలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిందీ చిత్రం.

Double Ismart Movie Still

ఉస్తాద్ రామ్ పోతినేని, డైరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart). ఈ సినిమా ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చి.. మిక్స్‌డ్ స్పందనను రాబట్టుకుంది. దీంతో ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తుందనేలా ఇప్పటికే వార్తలు హల్‌చల్ చేస్తుండగా.. సడెన్‌గా ఓటీటీలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిందీ చిత్రం. అసలు ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యిందనే విషయమే తెలియకుండా.. కామ్‌గా వచ్చి అందరికీ షాకిచ్చింది. ఓటీటీ యూజర్స్ అంతా.. అసలు సమాచారమే లేకుండా.. ఇదేం ట్విస్ట్ అన్నట్లుగా ఆశ్చర్యపోతున్నారు.

Also Read- Ram Charan: రామ్ చరణ్ భారీ విరాళం.. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..

ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లలో మిస్ అయిన వారంతా.. ఇక అమెజాన్ ప్రైమ్‌లో ఓ షో వేసుకోవచ్చు. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ సరసన హాట్ బ్యూటీ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించగా.. బిగ్ బుల్‌గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ నటించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని పూరి తెరకెక్కించారు. (Double ismart in OTT)


Double-Ismart-Still.jpg

‘డబుల్ ఇస్మార్ట్’ కథ విషయానికి వస్తే..బిగ్‌ బుల్‌ (సంజయ్‌ దత్‌) అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన డాన్‌. తన సామ్రాజాన్ని మరింత విస్తరించడానికి భారీ ప్లాన్‌లు చేస్తుంటాడు. ఇంటెలిజెన్స్‌ ఏజెన్పీ అతని కోసం వేటాడుతుంటుంది. అనుకోకుండా తనకి బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉందని, 3 నెలలు మించి బతకడని, దానికి చికిత్స లేదని డాక్టర్లు చెబుతారు. కానీ బతకడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆ తరుణంలో అతనిని సైంటిస్ట్‌ (మకరంద్‌ దేశ్‌ పాండే) కలుస్తాడు. మెమరీ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా మరణం లేకుండా జీవించవచ్చని చెబుతాడు. ఈ ప్రయోగం ఎవరి మీద చేసినా ఫెయిల్‌ అవుతూ ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రయోగం సక్సెస్‌ అయిన ఇస్మార్ట్‌ శంకర్‌ (రామ్‌) హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుంటారు. ఇస్మార్ట్‌ శంకర్‌ను తీసుకొచ్చి మెమరీ ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది. ఇస్మార్ట్‌ శంకర్‌... బిగ్‌ బుల్‌గా మారాడా? ఇంతకీ బిగ్‌ బుల్‌ ఎవరు? శంకర్‌ తల్లి పోచమ్మకి (ఝాన్సీ), బిగ్‌ బుల్‌కి సంబంధం ఏంటి? అన్నది తెలియాలంటే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాను చూడాల్సిందే.

Read Latest Cinema News

Updated Date - Sep 05 , 2024 | 11:01 AM

Double ismart Review: పూరి, రామ్ పోతినేని 'డబుల్‌ ఇస్మార్ట్‌' ఎలా ఉందంటే..

Double ISMART: ‘స్టెప్పామార్’ ఫుల్ వీడియో సాంగ్

Double ISmart : మాస్‌ మూమెంట్స్‌తో ‘స్టెప్పామార్‌’

Double ISMART: న‌రం న‌రం గ‌రం గ‌రం.. చ‌లి జ్వ‌రం ‘క్యా లఫ్డా’! అదిరిపోయిన‘డబుల్ ఇస్మార్ట్’ మూడో సింగిల్

Double Ismart: మార్ ముంత చోడ్ చింత వచ్చేస్తోంది.. రచ్చ రచ్చే!