Double Ismart: మార్ ముంత చోడ్ చింత వచ్చేస్తోంది.. రచ్చ రచ్చే!

ABN , Publish Date - Jul 14 , 2024 | 09:19 PM

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల డెడ్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్‌లు ఓ రేంజ్‌లో మొదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘స్టెప్పా మార్’ సెన్సేషనల్ హిట్‌గా మారింది. ఇప్పుడు మేకర్స్ ఈ మూవీ సెకండ్ సింగిల్ ‘మార్ ముంత చోడ్ చింత’ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌‌ని ఇచ్చారు.

Double Ismart Movie Still

ఉస్తాద్ రామ్ పోతినేని (Ustaad Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ (Puri Jagannadh)ల డెడ్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart). ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్‌లు ఓ రేంజ్‌లో మొదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘స్టెప్పా మార్’ సెన్సేషనల్ హిట్‌గా మారింది. ఇప్పుడు మేకర్స్ ఈ మూవీ సెకండ్ సింగిల్ ‘మార్ ముంత చోడ్ చింత’ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌‌ని ఇచ్చారు.

Also Read: అంబానీ ఇంట పెళ్లిలో సౌత్ స్టార్స్ సందడి..

‘మార్ ముంత చోడ్ చింత’ (Maar Muntha Chod Chinta) అనేది ఈ సిరీస్‌లో హీరో పాపులర్ డైలాగ్. పోస్టర్ సూచించినట్లు ఈ పాట మాస్ బ్లాస్ట్‌ను అందించబోతోందని తెలుస్తోంది. జూలై 16న రిలీజ్ ఈ పాటను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో రామ్ రెండు బాటిళ్ల కల్లును ఆస్వాదిస్తూ కనిపించారు. సెట్ వైబ్రెంట్‌గా కనిపిస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా కనిపించనుంది.


Maar-muntha.jpg

ఇంతకు ముందు వచ్చి బ్లాక్‌బస్టర్ అయిన ‘ఇస్మార్ట్ శంకర్’‌కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుగుతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని గియాన్నెలి సినిమాటోగ్రఫీ అందించారు.

Read Latest Cinema News

Updated Date - Jul 14 , 2024 | 09:19 PM