OTT Awards: ఉత్తమ నటుడు మనోజ్‌.. ఉత్తమ వ్యాఖ్యత రానా.. ఉత్తమ సిరీస్‌..

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:32 PM

ఓటీటీ మాధ్యమం (OTT)ఎంత పవర్‌ఫుల్‌గా మారిందో తెలిసిందే! సినిమాలకు దీటుగా ఓటీటీ కంటెంట్‌ ఉంటుందన్నది నిజం. డిఫరెంట్‌ కథలతో సినిమాలు, వెబ్‌సిరీస్‌లను రూపొందించి దర్శకులు తమ సత్తా చాటుతున్నారు.

ఓటీటీ మాధ్యమం (OTT)ఎంత పవర్‌ఫుల్‌గా మారిందో తెలిసిందే! సినిమాలకు దీటుగా ఓటీటీ కంటెంట్‌ ఉంటుందన్నది నిజం. డిఫరెంట్‌ కథలతో సినిమాలు, వెబ్‌సిరీస్‌లను రూపొందించి దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. యువతరం తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదొక మంచి వేదికగా నిలిచింది. ఈ క్రమంలో ఓటీటీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని నెటిజన్లకు అందిస్తోంది ‘ఓటీటీప్లే’ (OTT play). ‘వన్‌ నేషన్‌.. వన్‌ అవార్డ్‌’ (One nation .. One awards) పేరుతో ఓటీటీ వేదికగా సత్తా చాటిన నటీనటులు, దర్శకులకు అవారులను ప్రదానం చేస్తోంది. తాజాగా మూడో ఎడిషన్‌ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల ఓటీటీ ప్రేక్షకులను అలరించిన చిత్రాళు, వెబ్‌సిరీస్‌లకు అవార్డులు దక్కాయి. 


Jyothika.jpeg
ఓటీటీ చిత్రాలకు దక్కిన అవార్డులివే!

ఉత్తమ చిత్రం: గర్ల్స్‌ విల్‌ బి గర్ల్స్‌ (అలీ ఫజల్‌ అండ్‌ రిచా చద్దా)
ఉత్తమ దర్శకుడు (ఫిల్మ్‌): ఇంతియాజ్‌ అలీ (అమర్‌ సింగ్‌ చంకీలా)
ఉత్తమ నటుడు (పాపులర్‌): మనోజ్‌ బాజ్‌పాయ్‌ (డిస్పాచ్‌)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అనుపమ్ ఖేర్‌ (విజయ్‌69, ది సిగ్నేచర్‌)
ఉత్తమ నటి (పాపులర్‌): కాజోల్‌ (దోపత్తి)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): పార్వతి తిరువొత్తు (మనోరథంగళ్‌)
ఉత్తమ విలన్‌: సన్నీ కౌశల్‌ (ఫిర్‌ ఆయే హసీనా దిల్‌రుబా)
ఉత్తమ హాస్యనటి : ప్రియమణి (భామాకలాపం2)
ఉత్తమ నటనా ప్రతిభ: అవినాష్‌ తివారి (ది మెహతా బాయ్స్‌)
ఉత్తమ నటనా ప్రతిభ: షాలినీ పాండే (మహరాజ్‌)
వెబ్‌సిరీస్‌లలో అదగొట్టింది వీరే!


Majo.jpeg

ఉత్తమ వెబ్‌సిరీస్‌ : పంచాయత్‌ 3
ఉత్తమ దర్శకుడు: నిఖిల్‌ అడ్వాణీ (ఫ్రీడమ్‌ ఎట్‌ మిడ్‌ నైట్‌)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): జైదీప్‌ అహ్లవత్‌ (పాతాళ్‌లోక్‌2)
ఉత్తమ నటుడు (పాపులర్‌): రాఘవ్‌ జ్యుయెల్‌ (గయారా గయారా)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): నిమేషా సజయన్‌ (పోచర్‌)
ఉత్తమ నటి (పాపులర్‌): అదితి రావ్‌ హైదరి (హీరామండి)
ఉత్తమ సహాయ నటుడు : రాహుల్‌ భట్‌ (బ్లాక్‌ వారెంట్‌)
ఉత్తమ సహాయ నటి: జ్యోతిక (డబ్బా కార్టెల్‌)
ఉత్తమ హాస్య నటుడు: నీరజ్‌ మాధవ్‌ (లవ్‌ అండర్‌ కన్‌స్ట్రక్షన్‌)
ఉత్తమ నటనా ప్రతిభ: అభిషేక్‌ కుమార్‌ (తలైవేట్టయాన్‌ పాలయం)
ఉత్తమ నటనా ప్రతిభ: పత్రలేఖ (ఐసీ 814)


Shalini.jpegఓటీటీ స్పెషల్ అవార్డ్స్‌
ఉత్తమ టాక్‌ షో వ్యాఖ్యాత: రానా దగ్గుబాటి (ది రానా టాక్‌ షో)
ఉత్తమ రియాల్టీ షో: ది ఫ్యాబులస్‌ లైవ్స్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ వైవ్స్‌
ఉత్తమ నాన్‌ స్క్రిప్ట్‌ షో: షార్క్‌ ట్యాంక్‌
ట్రయల్‌ బ్లేజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌: శ్రీమురళి (బఘీర)
బహుముఖ ప్రదర్శనా నటి: కని కుశ్రుతి (గర్ల్స్‌ విల్‌ బి గర్ల్స్‌, పోచర్‌, తలైమలై సెయ్యలాగమ్‌)
బహుముఖ ప్రదర్శనా నటుడు: సిద్ధాంత్‌ గుప్త (ఫ్రీడమ్‌ ఎట్ మిడ్‌ నైట్‌, బ్లాక్‌ వారెంట్)

aditi.jpg
ఉత్తమ డాక్యుమెంటరీ సిరీస్‌: ది రోషన్స్‌
పయనీర్‌ కంట్రిబ్యూషన్స్‌ టు న్యూ వేవ్‌ సినిమా: అశ్విన్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌
ప్రామిసింగ్‌ నటి: హినా ఖాన్‌ (గృహలక్ష్మి)
ఉత్తమ పరిచయ వెబ్‌సిరీస్‌ నటి: వేదిక (యక్షిణి)
ప్రామిసింగ్‌ నటుడు: అపరశక్తి ఖురానా (బెర్లిన్‌)
రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌: అవనీత్‌ కౌర్‌ (పార్టీ టిల్‌ ఐ డై)
ట్రయల్‌ బ్లేజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌: దివ్య దత్‌ (శర్మజీ కా బేటి, బండిష్‌ బండిట్స్‌2)

ALSO READ: Nabha Natesh: నభా జీవితంలో ఊహించని సినిమాటిక్‌ ట్విస్ట్‌ ఏంటి

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2025 | 01:35 PM