PVR Inox: సినిమా నచ్చకపోతే పైసల్ రిటర్న్.. మల్టీప్లెక్సుల్లో బంపర్ ఆఫర్

ABN , Publish Date - Dec 21 , 2024 | 10:54 AM

సినిమా చూస్తూ థియేటర్ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు డబ్బులు వృధా అయ్యాయని బాధపడుతున్నారా? మీ కోసం ఓ గుడ్ న్యూస్..

PVR Inox: సినిమా నచ్చకపోతే పైసల్ రిటర్న్.. మల్టీప్లెక్సుల్లో బంపర్ ఆఫర్

మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ సినిమా వేస్ట్.. నాకు రిఫండ్ కావాలని. కొన్ని సార్లు సినిమా నచ్చకో లేదా ఇతర కారణాలతో థియేటర్ నుండి బయటకొస్తాం. తర్వాత అనవసరంగా డబ్బులు వృధా అయ్యాయి అని బాధపడతాం. అయితే ప్రేక్షకులు ఇలాంటి రిగ్రెట్ ఫీల్ కాకుండా మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ప్లాన్ చేస్తున్నాయి. సినిమా నచ్చకపోయిన మీరు మధ్యలోంచి బయటికి వచ్చిన మీ డబ్బులు మీకు రిటర్న్ చేస్తారు. ఇది ఎక్కడో ఫారెన్ లో కాదు. ఎక్కడ, ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే..


దేశంలోని మల్టీప్లెక్స్‌చైన్‌లలో పివిఆర్ ఐనాక్స్ (PVR Inox) ది అగ్ర స్థానం. తాజాగా పివిఆర్ తన ఆడియెన్స్ కోసం అదిరిపోయే ప్లాన్ ని ప్రవేశపెట్టింది. సినిమా నుండి మధ్యలో వెళ్ళిపోతే చూసిన టైమ్ అంత వరకే ఛార్జ్ చేసి మిగతా అమౌంట్ ని రిఫండ్ చేస్తారు. అయితే దీనికి మీరు టికెట్ ధరపై 10% అదనంగా పెట్టి కొనాలి. ఉదాహరణకి టికెట్ ధర రూ. 300 అయితే మీరు రూ. 330 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ని ప్రస్తుతం ఢిల్లీ నగరంలో అమలు చేయనున్నారు. సక్సెస్ రేటును బట్టి ఇతర నగరాలకు విస్తరించనున్నారు.


ఇక మిడిల్ క్లాస్ ప్రేక్షకులు అదనపు ఛార్జులు భరించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేదే ప్రశ్న. ఒక సినిమా ఎలా ఉన్న డబ్బులు పెట్టాము కదా అని సగటు అభిమానులు చివరి వరకు చూసే సంప్రదాయం మనది. ఇది సింగిల్స్, కపుల్స్, ఫ్యామిలీస్ ఎవరికీ ఎక్కువ ఉపయోగపడుతుంది? జనాలు ఎలా స్పందిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

Updated Date - Dec 21 , 2024 | 11:01 AM