Telugu Film Producer: ముళ్ళపూడి బ్రహ్మానందం కన్నుమూత

ABN , Publish Date - Apr 01 , 2025 | 09:16 AM

జగపతిబాబు, శ్రీకాంత్, నరేశ్ తో పలు చిత్రాలను నిర్మించిన ముళ్ళపూడి బ్రహ్మానందం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి.

ప్రముఖ దర్శక నిర్మాత ఇవీవీ సత్యనారాయణ (Evv Satyanarayana) బావ, సినీ నిర్మాత ముళ్ళపూడి బ్రహ్మానందం (68) (Mullapudi Brahmanandam) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇవీవీ సత్యనారాయణ సోదరిని బ్రహ్మానందం వివాహం చేసుకున్నారు. ఇవీవీ ప్రోత్సాహంతో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టిన బ్రహ్మానందం మిత్రులతో కలిసి పలు చిత్రాలు నిర్మించారు. ఇవీవీ దర్శకత్వంలో 'ఆమె' (Aame), గుణశేఖర్ దర్శకత్వంలో 'మనోహరం' (Manoharam), ఇ. సత్తిబాబు దర్శకత్వంలో 'నేను' (Nenu), 'ఓ చిన్నదాన' (O Chinadana) చిత్రాలను నిర్మించారు. అలానే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో జగపతిబాబు (Jagapahti Babu) హీరోగా 'అల్లుడు గారు వచ్చారు' సినిమాను ప్రొడ్యూస్ చేశారు.


కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముళ్ళపూడి బ్రహ్మానందం ఆదివారం రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆయన కుమారుడు హైదరాబాద్ వచ్చాక బుధవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ముళ్ళపూడి బ్రహ్మానందం మృతి పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ సంతాపం వెలిబుచ్చింది.

Also Read: Vaishnavi chaitanya: దీపం ఉండగానే...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 01 , 2025 | 09:16 AM