పుడ్తామా యేటి మళ్లీ
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:48 AM
రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘ఒకటే పని సేసేనాకి..
రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘ఒకటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు.. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాల.. పుడ్తామా యేటి మళీ’్ల అంటూ ఉత్తరాంధ్ర యాసలో రామ్‌చరణ్ పలికిన డైలాగులతో మొదలైన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా కనిపించనున్నారు. ఆయన మాస్ లుక్, ఏఆర్ రెహ్మాన్ సంగీతం, రత్నవేలు విజువల్స్ ప్రధానాకర్షణగా నిలిచాయి. సినిమాను వచ్చే ఏడాది శ్రీరామనవమి సందర్భంగా మార్చి 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజు రామ్‌చరణ్ పుట్టినరోజు కూడా కావడం విశేషం. కాగా, ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. జగపతిబాబు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాణ సంస్థలు మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకటసతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి
No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం
Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ
Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా
Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..
Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం
శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు
కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ
For Telangana News And Telugu News