ప్రేక్షకుల ముందుకు చంద్రేశ్వర
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:39 AM
క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘చంద్రేశ్వర’. సురేశ్ రవి, ఆశా వెంకటేశ్ జంటగా నటించారు. జీవీ పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్రాచారి నిర్మించారు...
క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘చంద్రేశ్వర’. సురేశ్ రవి, ఆశా వెంకటేశ్ జంటగా నటించారు. జీవీ పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్రాచారి నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆధ్యాత్మిక అంశాలకు వినోదాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నాయి’ అని తెలిపారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి, ఈ నెల్లోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు.