వైజయంతితో వారసుడు

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:47 AM

నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లపై...

నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లపై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మించారు. విజయశాంతి శక్తిమంతమైన పోలీస్‌ పాత్రలో నటించారు. శ్రీకాంత్‌, సాయిమంజ్రేకర్‌, సోహైల్‌ ఖాన్‌ కీలక పాత్రలు పోషించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఇందులో విజయశాంతి ముందు కుర్చీలో కూర్చున్న కల్యాణ్‌రామ్‌.. విలన్‌ గ్యాంగ్‌ పనిపడుతూ కనిపించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: తమ్మిరాజు, డీఓపీ: రామ్‌ప్రసాద్‌, సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌.

Updated Date - Apr 07 , 2025 | 05:47 AM