చేయిపట్టి లాగారు

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:45 AM

నటి శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. ముంబైలో షూటింగ్‌ పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు ఆమె చేయి పట్టుకొని బలం ఉపయోగించి తమ గుంపులోకి...

నటి శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. ముంబైలో షూటింగ్‌ పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు ఆమె చేయి పట్టుకొని బలం ఉపయోగించి తమ గుంపులోకి లాగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా అనురాగ్‌ బసు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో ఆమె నటిస్తున్నారు. షూటింగ్‌ నిమిత్తం చిత్రబృందం ఇటీవల డార్జిలింగ్‌ వెళ్లింది. చిత్రీకరణ అనంతరం కార్తిక్‌ ఆర్యన్‌తో కలసి శ్రీలీల తిరిగి వస్తుండగా వారిని చూసేందుకు స్థానికులు, అభిమానులు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో వారికి అభివాదం చేసుకుంటూ ఆమె ముందుకు నడిచారు. ఇంతలో బాడీగార్డులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్న గుంపులోంచి కొంత మంది ఆకతాయిలు ఆమె చేయి పట్టుకొని లాగారు. దీంతో శ్రీలీల షాక్‌కు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది ఆమెను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు.

Updated Date - Apr 07 , 2025 | 05:45 AM