VK Naresh: వ్యాయామంతోనే ఆరోగ్యం...
ABN , Publish Date - Mar 23 , 2025 | 10:59 PM
నిత్యం వ్యాయామం చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమని సినీ నటుడు వీకే నరేష్ అన్నారు.
నిత్యం వ్యాయామం చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమని సినీ నటుడు వీకే నరేష్ అన్నారు. నానక్‌రామ్‌గూడలోని విజయ్‌కృష్ణ టవర్స్‌లో Gold's జిమ్ నూతన బ్రాంచ్‌ను నరేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "Gold's జిమ్‌కు పెద్ద చరిత్ర ఉంది. ఎన్నో ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇప్పుడు ఆధునిక వసతులతో మంచి ఏరియాలో ఇది ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. నేటితతరం చురుకైన జీవనశైలికి జిమ్ ఎంతో తోడ్పడుతుంది. ప్రపంచ స్థాయిలో ఫిట్‌నెస్ శిక్షణతో Gold's జిమ్ నిర్వహించడం గర్వంచదగ్గ విషయం. ఫిట్‌నెస్ మా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం, ఉత్తమ ప్రమాణాలు, సౌకర్యలతో ఫిట్‌నెస్ ప్రేమికులకు Gold's జిమ్ సేవలను అందించనుంది. నానక్‌రామ్ గూడ సమీపంలో ఉన్న అన్ని ఏరియాలకు ఇది అందుబాటులో ఉంది'' అని అన్నారు.
జిమ్ నిర్వాహకులు మాధన్ మోహన్ రాజు, కార్తీక్ పేనాని, చండు, అనిల్ వర్క్ మేనేజింగ్ డైరెక్టర్లు మాట్లాడుతూ నరేశ్ చేతుల మీదుగా జిమ్ ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉందని తెలిపారు. Gold's జిమ్ 1965లో స్థాపించబడింది. ప్రపంచ ప్రఖ్యాత ఫిట్‌నెస్ బ్రాండ్, ఇది 30కి పైగా దేశాల్లో ఉంది. ఉత్తమమైన శిక్షణ, అత్యాధునిక పరికరాలతో ఈ జిమ్ అగ్రస్థానంలో నిలిచింది’ అని అన్నారు.