Somi Ali: ఫ్లీజ్ సల్మాన్‌ను వదిలేయండి.. అవసరమైతే నేనొస్తా
ABN , Publish Date - Oct 19 , 2024 | 06:33 AM
ప్రస్తుతం మన దేశంలో హాట్ టాపిక్‌గా ఉన్న అంశం ఏదైనా ఉందా అంటే అది సల్మాన్ ఖాన్ విషయమే అని చెప్పాలి. తాజాగా ఈ అంశంలో సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ సోమీ అలీ లారెన్స్ బిష్ణోయ్‌కు ఓపెన్ మెసేజ్ పంపింది.
ప్రస్తుతం మన దేశంలో హాట్ టాపిక్‌గా ఉన్న అంశం ఏదైనా ఉందా అంటే అది సల్మాన్ ఖాన్ (Salman Khan) విషయమే అని చెప్పాలి. ఇటీవల ముంబైలో ఎన్సీపీ పార్టీ లీడర్ సిద్ధిఖీ హత్య నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యతను సంతరించుకుంది. పైగా ఆ హత్య మేమే చేశామంటూ భిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ ప్రకటించడం దేశవ్యాప్తంగా హై లర్ట్ ఏర్పడేలా చేసింది. ఇప్పటికే లారెన్స్ భిష్ణోయ్ గత కొంతకాలంగా సల్మాన్‌ఖాన్‌ను బెదిరించడం, ఒకటి రెండు సార్లు దాడి ప్రయత్నాలు చేసిన క్రమంలో సల్మాన్ ఖాన్ అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన వార్తగా కూడా మారాడు.
రీసెంట్గా మరోసారి భిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌కు బెదిరిస్తూ మెసేజ్ వచ్చిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్(Salman Khan) కు ప్రభుత్వం సెక్యూరిటీని రెట్టింపు చేయడంతో పాటు నిఘాను కూడా పెంచారు.
ఈ క్రమంలోనే సల్మాన్ తన రక్షణ కోసం మరో బుల్లెట్ ఫ్రూఫ్ వాహానాన్ని కొనుగోలు చేసేందుకు ఉపక్రమించిన వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్‌కు మద్దతుగా మాజీ గర్ల్‌ఫ్రెండ్ చేసిన మెసేజ్ ఆసక్తికరంగా మారింది.
గతంలో జరిగిపోయిన సల్మాన్ ఖాన్ (Salman Khan) చర్యలను క్షమించాలని సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ సోమీ అలీ (Somi Ali) లారెన్స్ బిష్ణోయ్‌ని కోరింది. అవసరమైతే తాను బిష్ణొయ్ ఆలయంలో పూజలు చేయటానికి రాజస్థాన్ రావడానికి కూడా సిద్దమని పేర్కొంది. అంతేకాదు లారెన్స్ బిష్ణోయ్‌తో మాట్లాడాతానంటూ ఇన్ స్టాలో పోస్ట్ షేర్ చేసింది. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా సోమీ అలీ చేసిన ఆ పోస్టు ప్రస్తుతం డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.