Bhookailas: ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు ఉదయం 5 గంటలకు షూటింగ్ అని చెప్పిన దర్శకుడు రాకపోవడంతో..?

ABN , First Publish Date - 2023-05-07T15:36:22+05:30 IST

‘భూకైలాస్‌’ చిత్రంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్‌లో చాలా సన్నివేశాలు ఉన్నాయి. సెట్‌లో ఒకరి కంటే మరొకరు ముందు ఉండాలని వీరిద్దరూ పోటీ పడేవారు. అందరికంటే ముందు హీరోలు సెట్‌లో ఉండడంతో యూనిట్‌ సభ్యులు

Bhookailas: ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు ఉదయం 5 గంటలకు షూటింగ్ అని చెప్పిన దర్శకుడు రాకపోవడంతో..?
ANR And NTR

తెలుగు, తమిళ భాషల్లో ఆణిముత్యాల వంటి చిత్రాలను నిర్మించిన సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్‌ (AVM Productions). ఎన్టీఆర్‌ (NTR), ఏయన్నార్‌ (ANR), కృష్ణ (Krishna), శోభన్‌ బాబు (Sobhan Babu), చిరంజీవి (Chiranjeevi).. ఇలా తెలుగులో అప్పటి అగ్ర కథానాయకులందరితోనూ ఈ సంస్థ చిత్రాలు నిర్మించింది. వీటిల్లో అధిక శాతం విజయవంతమయ్యాయి. ఎన్టీఆర్‌తో, ఏయన్నార్‌లతో విడివిడిగా సినిమాలు తీయడమే కాకుండా వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా నిర్మించారు ఏవీఎం ప్రొడక్షన్స్‌ సంస్థ అధినేత మొయ్యప్ప చెట్టియారు (A. V. Meiyappan). ఆ చిత్రం పేరు ‘భూకైలాస్‌’ (Bhookailas). ఎన్టీఆర్‌ తొలిసారిగా రావణ (Ravana) పాత్రను పోషించింది ఈ చిత్రంలోనే. అలాగే ఇందులో నారదుడి పాత్రను అక్కినేని (ANR) ధరించారు. ‘భూకైలాస్‌’ చిత్రంలో వీరిద్దరి కాంబినేషన్‌లో చాలా సన్నివేశాలు ఉన్నాయి. సెట్‌లో ఒకరి కంటే మరొకరు ముందు ఉండాలని వీరిద్దరూ పోటీ పడేవారు. అందరికంటే ముందు హీరోలు సెట్‌లో ఉండడంతో యూనిట్‌ సభ్యులు అలెర్ట్‌ అయ్యేవారు. చిత్ర కథానాయిక జమున (Jamuna) కూడా వీలైనంత త్వరగా సెట్‌కి రావడానికి ప్రయత్నించేవారు.. ఈ చిత్రంలో సూర్యోదయ సన్నివేశం ఒకటుంది.

అందులో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ (NTR And ANR) పాల్గొనాలి. అందుకే చిత్ర దర్శకుడు కె. శంకర్‌ (K. Shankar) ముందు రోజు సాయంత్రం ఈ అగ్ర నటులిద్దరి దగ్గరకి వెళ్లి ‘రేపు ఉదయం సూర్యోదయ సన్నివేశాన్ని మీ ఇద్దరి మీద బీచ్‌లో చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశాం. మీరిద్దరూ ఉదయం ఐదు గంటల కల్లా స్పాట్‌లో ఉంటే ఒక గంట, గంటన్నర సమయంలో ఆ షాట్స్‌ తీసేసుకుని రావచ్చు’ అని చెప్పారు. దర్శకుడు చెబితే ఇక తిరుగేముంది? ‘ఓకే అలాగే వస్తాం.. మీరు ఏర్పాట్లు చేసుకోండి’ అని చెప్పారు హీరోలిద్దరూ. అది సోషల్‌ సినిమా కాదు కదా. అందుకే రోజు లేచే సమయానికంటే ముందు లేచి మేకప్‌తో సిద్ధమై ఐదు గంటలకల్లా బీచ్‌కు చేరుకున్నారు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌. కానీ ఆశ్చర్యం! అక్కడ షూటింగ్‌‌కు సంబంధించిన వాళ్లు ఎవరూ లేరు. పొరపాటున వేరే ప్రదేశానికి వచ్చామా అని హీరోలిద్దరూ మొదట సందేహించినా తమకు చెప్పిన ప్రదేశం ఇదేనని నిర్ధారించుకున్నారు.

NTR-and-ANR.jpg

సరే వస్తారు కదా అని ఆ బీచ్‌లో ఇసుక మీద కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌. ఆరు దాటింది. అయినా యూనిట్‌ సభ్యుల అలికిడి లేదు. ఎక్కడో తేడా జరిగి ఉంటుందనుకుని ఇక ఇంటికి వెళ్లడానికి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ సిద్ధమయ్యేసరికి దర్శకుడు శంకర్‌ (Director Shankar) కారులో అక్కడికి వచ్చారు. మేకప్‌తో సిద్దంగా ఉన్న ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లను చూడగానే ఆయన వణికిపోయారు. కారులోంచి ఒక్కసారిగా కిందకు దూకేసి వాళ్ల కాళ్ల మీద పడ్డారు. పొరపాటయింది. క్షమించమని బతిమాలాడారు. అగ్ర హీరోలు ఆగ్రహించకపోవడంతో ఆ తర్వాత కొద్ది సేపటికి ‘భూకైలాస్‌’ (Bhookailas) షూటింగ్‌ మొదలైంది. అదండీ సంగతి.

ఇవి కూడా చదవండి:

************************************************

*Farhana: ఇస్లాంకు వ్యతిరేకం కాదు.. కేరళ స్టోరీ కాంట్రవర్సీతో చిత్రయూనిట్ ముందు జాగ్రత్త చర్యలు

*The Kerala Story: కేరళ స్టోరీకి తమిళ నాడులో షాక్.. విషయం ఏమిటంటే?

*NTR: మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?

*Pic Talk: చందురుని మించు అందమొలికించు...

*Dimple Hayathi: కొంటె పనులు చాలా చేశాను

*Megastar VS Superstar: చిరంజీవికి పోటీగా రజనీకాంత్.. ఆగస్ట్‌లో అసలు మజా!

Updated Date - 2023-05-07T15:36:22+05:30 IST

News Hub