NTR: తిమ్మరుసు... రాయలు

ABN , Publish Date - Mar 24 , 2025 | 06:21 PM

ఎన్టీఆర్, గుమ్మడి కీలక పాత్రలు పోషించిన చిత్రం 'మహామంత్రి తిమ్మరసు'. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి రాష్ట్రపతి రజత పతకం లభించింది. గుమ్మడికి ఉత్తమ నటునిగా ప్రెసిడెంట్ అవార్డు కూడా దక్కింది.

నటరత్న యన్టీఆర్ (NTR), విలక్షణ నటుడు గుమ్మడి (Gummadi) అనేక చిత్రాల్లో కలసి నటించారు. తండ్రీకొడుకులుగా, అన్నదమ్ములుగా, మామాఅల్లుళ్ళుగా, తాతమనవడుగా, బావబావమరదులుగా నటించి అలరించారు. నిజానికి గుమ్మడి కంటే యన్టీఆర్ వయసులో మూడేళ్ళు పెద్దవారు. అయితే గుమ్మడి ఆరంభంలోనే వయసుమీద పడ్డ పాత్రల్లో నటించడం వల్ల ఆయన తరువాతి రోజుల్లో తనకంటే వయసులో పెద్దవారయిన యన్టీఆర్, ఏయన్నార్ కు తండ్రిగా, అన్నగా నటిస్తూ సాగారు. గుమ్మడి నటజీవితంలో ఎన్ని సినిమాల్లో నటించినా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేసిన చిత్రం 'మహామంత్రి తిమ్మరుసు' (Mahamantri Timmarusu). కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో యన్.రామబ్రహ్మం, అట్లూరి పుండరీకాక్షయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 1962 జూలై 26న విడుదలైన 'మహామంత్రి తిమ్మరుసు'లో యన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలుగా, గుమ్మడి తిమ్మరుసుగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి రాష్ట్రపతి రజత పతకం లభించింది. గుమ్మడికి ఉత్తమ నటునిగా ప్రెసిడెంట్ అవార్డు కూడా దక్కింది.


నందమూరి, గుమ్మడి మధ్య కొందరివల్ల అపార్థాలు చోటు చేసుకున్నాయి. అయితే ఓ రోజున గుమ్మడి స్వయంగా వెళ్ళి యన్టీఆర్ ను కలసి వాటిని నివృత్తి చేసుకున్నారు. మళ్ళీ వారి అనుబంధం కడదాకా సాగింది. 'మహామంత్రి తిమ్మరుసు'లోని యన్టీఆర్, గుమ్మడి పిక్స్ ఈ నాటికీ ఫ్యాన్స్ కు కనువిందు చేస్తున్నాయి. అలాంటిదే ఈ ఫొటో!

Also Read: Fakir: ఓటీటీలో ధనుష్ హాలీవుడ్ మూవీ!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 24 , 2025 | 06:21 PM