KV Mahadevan: మామంటే మామేనంటా!?
ABN , Publish Date - Mar 19 , 2025 | 03:34 PM
సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్ తెలుగులో సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. సినిమా రంగం ఆయన్ని మామ అని ప్రేమగా పిలిచేది.
తెలుగువారికి ప్రియమైన సంగీత దర్శకుల్లో కేవీ మహదేవన్ (KV Mahadevan) స్థానం ప్రత్యేకమైనది. ఆయన తెలుగువారు కాకపోయినా, తేనేలూరే తెలుగుపదాలతో మరింత మధురం పంచిన ఘనుడు. అందుకే మహదేవన్ ను 'మామ' అంటూ తెలుగువారు అభిమానించేవారు. ఆయన స్వరకల్పనకు అభిమానులై ఆయన సంగీతంతోనే సాగాలని తపించిన నిర్మాతలూ ఉన్నారు. మామ కూడా తెలుగు చిత్రసీమలో అందరివాడు అనిపించుకున్నారు. మామ ఎంతలా మనవారితో కలసి పోయేవారో ఈ పిక్ చూస్తే తెలుస్తుంది. సి.అశ్వనీదత్ (C.Aswani Dutt) నిర్మించిన ఓ సినిమా పాటల రికార్డింగ్ సమయంలో సుశీలమ్మ (P.Suseela), ఎస్పీ బాలు (SP Balu), దత్, ఆత్రేయ (Atreya)తో 'మామ' ఇలా కనిపించారు. మామ అణకువలోనే ఆయన అభిమానం కనిపిస్తోంది కదండీ!