Thandel: బన్నీ.. మళ్ళీ ఆ పొరపాటు చేయకపోతే చాలు..

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:03 PM

Thandel: నాగ చైతన్య 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నాడు. ఈ నేపథ్యంలోనే కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Thandel: బన్నీ.. మళ్ళీ ఆ పొరపాటు చేయకపోతే చాలు..
Allu Arjun attending Thandel Pre Realese Event

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం 'తండేల్'. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా’ పాటలు మ్యూజిక్ చార్టులలో టాప్ ప్లేస్‌లో, అలాగే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మరింత బజ్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా హిందీ ట్రైలర్ ని ఆమీర్ ఖాన్, తమిళ్ ట్రైలర్ ని హీరో కార్తీ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.


ఇక ప్రమోషన్స్ లో కీలకమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరపనున్నారు. కాగా, ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా రానున్నారు. దీంతో బాగా ఈ ఈవెంట్ పై బాగా హైప్ పెరిగిన బన్నీ ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది. ఎందుకంటే.. ఇప్పటికి మెగా ఫ్యాన్స్ బన్నీపై కాస్త ఘాటుగానే వ్యవహరిస్తుండగా, మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ద్వారా బన్నీ ఇమేజ్ కి బాగా డ్యామేజ్ జరిగింది. ముఖ్యంగా బన్నీ ఏ వేదికపై మాట్లాడిన, మీడియాతో మాట్లాడిన కాంట్రవర్సీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే బన్నీ 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇక ఈ సినిమా విషయానికొస్తే.. రూ. 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా చైతన్య కెరీర్ లో ఎంతో కీలకంగా మారనుంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ ని పూర్తి చేసుకుంది. అలాగే యు/ఎ సర్టిఫికెట్ ను పొందింది. ఈ సినిమా 2 గంటల 32 నిమిషాల నిడివితో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Also Read-Netflix under Pushpa’s Rule: పుష్ప గాడి రూల్‌లో నెట్‌ఫ్లిక్స్..

Also Read- Bad Girl: సమాజంలో కులం ఉంది కాబట్టే సినిమాల్లో కులం

Also Read- Kangana Ranaut: కాజోల్‌, దీపికా ముద్దు.. మేమంటే చేదు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 04:07 PM