Aghathiyaa: జనవరి 31న రిలీజ్ కావాల్సిన ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ వాయిదా..
ABN , Publish Date - Jan 31 , 2025 | 08:55 AM
Aghathiyaa Postponed: జనవరి 31న విడుదల కావాల్సిన ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ ‘అగత్యా’ను చివరి నిమిషంలో మేకర్స్ వాయిదా వేశారు. వాస్తవానికి ఈసినిమాకు ఎటువంటి ప్రమోషన్స్ మేకర్స్ నిర్వహించలేదు. కారణం, వారు చెప్పిన టైమ్‌కి ఈ సినిమా పూర్తి కాదని వారికి తెలుసు. అందుకే, ఈ సినిమా ఎందుకు వాయిదా వేస్తున్నారో తెలుపుతూ.. మరో కొత్త తేదీని విడుదలకు మేకర్స్ ఫిక్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

జనవరి 31న రిలీజ్ కావాల్సిన ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ సినిమాను వాయిదా వేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, రాశీ ఖన్నా ప్రధాన తారాగణంగా నటిస్తున్న తాజా చిత్రం ‘అగత్యా’. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 31న అధికారికంగా విడుదల అంటూ ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసి ఉన్నారు. కానీ, ఆ తేదీకి ఈ సినిమా విడుదల కావడం లేదని తెలుపుతూ.. మరో డేట్‌ని మేకర్స్ ప్రకటించారు.
Also Read- Kollywood Directors: కోలీవుడ్ డైరెక్టర్లు.. భయపడుతున్న టాలీవుడ్ హీరోలు!
‘అగత్యా’ నుంచి ఇటీవల విడుదలైన సెకెండ్ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ‘నేలమ్మ తల్లి’ అంటూ సాగిన ఈ పాట అర్జున్‌ను హైలెట్ చేస్తూ ఉంది. ఇంతకు ముందు జీవా నటించిన చిత్రం ‘బ్లాక్’ కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ‘అగత్యా’ సినిమాతో తమిళ, తెలుగు, హిందీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఇందులో మన సంస్కృతి, మానవ అనుబంధాలను దర్శకుడు బలంగా స్పృశిస్తున్నట్లుగా తెలుస్తోంది. మార్వెల్ చిత్రాల తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు చిత్ర యూనిట్ కృషి చేస్తోంది.
Also Read- Kiss Scene: ఆ ముద్దు సీన్ ట్రిమ్ చేశారు.. పాపం పూజా హెగ్డే?
ఈ నేపథ్యంలో వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం మరికొంత టైమ్ కేటాయించాలని భావించిన మేకర్స్.. సినిమా రిలీజ్‌ను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 28కి పోస్ట్ పోన్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అవేంజర్స్ తరహాలో ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లేలా.. ఊహాత్మక కథా చిత్రంగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలనే ఉద్దేశంతో కొంత సమయం తీసుకుంటున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సినిమా ఎప్పుడు వచ్చినా.. చూసే ప్రతి ఒక్కరికీ ‘అగత్యా’ సరికొత్త అనుభూతిని అందిస్తుందనే ధీమాని యూనిట్ వ్యక్తం చేస్తోంది.