K Achireddy : జై ఆంధ్ర ఉద్యమంలో ప్రముఖ నిర్మాత... అప్పట్లో అలా!

ABN , Publish Date - Feb 25 , 2025 | 11:48 AM

ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి విద్యార్థి రాజకీయాల్లోనూ చురుకైన పాత్రను పోషించారు. ఇటీవల ఆయన చదువుకున్న అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కలయిక కార్యక్రమం జరిగింది.

K Achireddy : జై ఆంధ్ర ఉద్యమంలో ప్రముఖ నిర్మాత... అప్పట్లో అలా!

ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి (K Achireddy) కి సొంత ఊరంటే ఎంతో అభిమానం. అందుకే హైదరాబాద్ వచ్చి స్థిరపడినా... ఏ మాత్రం అవకాశం ఉన్నా పండగలకు పబ్బాలకు స్వగ్రామం వెళుతుంటారు. ఇటీవల ఆయన చదువుకున్న అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమం జరిగింది. అత్తిలి షాదీఖానా భవనంలో జరిగిన ఈ వేడుకకు 1971-73 ఇంటర్మీడియట్ బ్యాచ్ విద్యార్థులు 52 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. ఇందులో కొందరు అనారోగ్యంతో కన్నుమూశారు. వారికి నివాళులు అర్పిస్తూ, ఆనాటి రోజుల్ని వీరంత గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తమతో చదువుకున్న ప్రముఖ నిర్మాత కొవ్వూరి అచ్చిరెడ్డిని మిత్రులంతా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి చంటి, జెడ్పీ కోఆప్టెడ్ మెంబర్ మహమ్మద్ అబీబుద్దీన్, దిరిశాల ప్రసాద్, చిన్నం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్ లీడర్ గా ఉన్న కె. అచ్చిరెడ్డి అప్పట్లో జై ఆంధ్ర (Jai Andhra) ఉద్యమంలో పాల్గొని, నిరాహార దీక్ష చేసిన ఫోటో విపరీతంగా వైరల్ అయ్యింది. విశేషం ఏమంటే... ఇదే కాలేజీలో తర్వాతి రోజుల్లో బ్రహ్మానందం (Brahmanandam) లెక్చరర్ గా పనిచేశారు.


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Feb 25 , 2025 | 12:05 PM