Vaishnavi Chaitanya; ఫస్ట్‌ క్రష్‌ ఆ క్యూట్ హీరోనే..చచ్చిపోతా అతనంటే..

ABN , Publish Date - Apr 06 , 2025 | 08:42 AM

‘బేబీ’తో (Baby Movie) ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారింది వైష్ణవి చైతన్య. తర్వాత ‘లవ్‌ మీ: ఇఫ్‌ యూ డేర్‌’ అంటూ ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేసింది కానీ పెద్దగా వర్కవుట్‌ కాలేదు.

‘బేబీ’తో (Baby Movie) ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారింది వైష్ణవి చైతన్య. తర్వాత ‘లవ్‌ మీ: ఇఫ్‌ యూ డేర్‌’ అంటూ ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేసింది కానీ పెద్దగా వర్కవుట్‌ కాలేదు. అయినా సరే ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌, ‘టిల్లూ’ సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్‌లో రాబోతున్న ‘జాక్‌’లో (Jack) జాక్‌పాట్‌లాంటి ఆఫర్‌ కొట్టేసింది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విశేషాలివి... (Vaishnavi CHaitanya)

సరదాగా పాడిన పాట

కూచిపూడి, పాశ్చాత్య నృత్యంలో నాకు ప్రావీణ్యం ఉందని చాలామందికి తెలుసు. ఎవరికీ తెలియని విషయమేంటంటే... నేను పాటలు కూడా బాగా పాడతా. అలాగని ప్రొఫెషనల్‌ సింగర్‌ని కాదు. ఇంట్లో సరదాగా పాడుతుంటా. చిన్నతనంలో గుళ్ళు, అయ్యప్ప భజనల్లో పాడేదాన్ని. ఓసారి ‘లవ్‌ మీ’ సెట్‌లో సరదాగా హమ్‌ చేస్తుంటే, అది విని మా డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ ‘రావాలి రా’ అనే పాటకు ఒక వెర్షన్‌ని నాతో పాడించాలనుకున్నారు. దాంతో కీరవాణి గారి దగ్గర నాలుగు రోజులు శిక్షణ తీసుకుని నా స్టైల్‌లో పాడేశా. ఆ పాటకు మంచి ఆదరణ లభించింది.

Vaishnavi.jpg

ఎంత కష్టమైనా సరే...

‘గంగూబాయి కఠియావాడి’లో అలియాభట్‌ నటనకి ఫిదా అయ్యా. ఆ పాత్రకు ప్రాణం పోసిందామె. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ఆస్కారం ఉన్న అలాంటి పాత్రలు వస్తే గనుక... ఎంత కష్టమైనా సరే నటించడానికి నేను రెడీ. నటనకి ప్రాధాన్యం ఉందంటే ఆ పాత్ర గ్లామర్‌గా ఉందా? డీ గ్లామర్‌గా ఉందా? అనే విషయాల్ని అస్సలు పట్టించుకోను.

ఓపిక అవసరం

హీరోయిన్లుగా తెలుగమ్మాయిలకు అవకాశాలు రావనే ప్రచారం ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ దుష్ప్రచారాన్నే నిజమని భావించి చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడం లేదు. ఎవరైనా సరే, ప్రయత్నిస్తేనే కదా.. అసలు అవకాశం వచ్చేది, రానిది తెలిసేది. నిజానికి ఓపికతో గట్టిగా ప్రయత్నిస్తే అవకాశాలు తలుపు తట్టక మానవు. నా విషయంలో అదే నిజమైంది. కాబట్టి ఇండస్ట్రీలోకి రావాలనుకునేవారికి నేనిచ్చే సలహా కూడా ఇదే.


Untitled-1.jpg

అల్లరిపనులు చాలా చేశా...

చిన్నప్పుడైతే నేను చేయని అల్లరి పనే ఉండేది కాదు. స్కూల్లో స్నేహితుల పెన్సిళ్లు, పెన్నులు, రబ్బర్లు దొంగిలించి, వాళ్ల బెంచ్‌ డెస్క్‌లోనే దాచి... ఏమి ఎరగనట్టు ఉండేదాన్ని. అలా రోజంతా వాళ్లని ఆటపట్టించడం సరదాగా అనిపించేది. చార్మినార్‌, బేగంబజార్‌ షాపింగ్‌కి వెళ్లినప్పుడు రబ్బర్‌ బ్యాండ్లు, క్లిప్పులు, లిప్‌స్టిక్స్‌... ఏవైనా నచ్చితే ఎవరికంటా పడకుండా వాటిని నా హ్యాండ్‌బ్యాగ్‌లో వేసుకునేదాన్ని. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటుంటే నవ్వొస్తుంది.

తొలిప్రేమ...

స్కూల్లో చాలా క్రష్‌లుండేవి. పూర్తిస్థాయిలో రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టింది మాత్రం పద్దెనిమిదేళ్ల వయసులోనే. కొన్ని అనివార్య కారణాల వల్ల మా బంధం ముందుకెళ్లలేకపోయింది. కానీ నా దృష్టిలో ఫస్ట్‌లవ్‌ ఎప్పటికీ సమ్‌థింగ్‌ స్పెషలే. ఎన్నేళ్లు గడిచినా తొలిప్రేమ అనుభూతులు మనసులో తీపి జ్ఞాపకాలుగానే ఉంటాయి. అభిమానుల నుంచి లవ్‌ ప్రపోజల్స్‌ చాలా వచ్చాయి. ‘బేబీ’ తర్వాత ఎక్కువయ్యాయి.

Vc.jpg

ఫటా ఫట్‌

- మొదటి పారితోషికం: 3వేల రూపాయలు

- మర్చిపోలేని ప్రశంస: చిరంజీవిగారు సహజనటి జయసుధ గారితో నన్ను పోల్చడం.

- అబ్బాయిల్లో మొదటగా గమనించేవి: కళ్లు, నవ్వు

- ఎవరికీ తెలియని విషయం: వంట బాగా చేస్తా, ముగ్గులేస్తా

- ఫస్ట్‌ క్రష్‌: రామ్‌ పోతినేని

- ఫేవరెట్‌ హీరోయిన్స్‌: అనుష్క, సాయిపల్లవి

- ఎక్కువగా వాడే ఊతపదం: నిజంగానా

- ఇష్టమైన ఫుడ్‌: బిర్యానీ

- నా బలం: నాపై నాకు నమ్మకం ఎక్కువ.

Updated Date - Apr 06 , 2025 | 08:42 AM