IIFA Digital Awards : వైభవంగా ఐఫా ఓటీటీ అవార్డుల వేడుక

ABN , Publish Date - Mar 09 , 2025 | 11:28 AM

జైపుర్‌ వేదికగా ఐఫా అవార్డుల వేడుక మొదలైంది. ఇందులో ఉత్తమ నటి, ఉత్తమ నటుడు అవార్డులు ఎవరికీ దక్కాయంటే

IIFA Digital Awards : వైభవంగా ఐఫా ఓటీటీ అవార్డుల వేడుక

భారతీయ సినీ పరిశ్రమ ప్రత్యేకంగా  భావించే ఐఫా అవార్డుల (IIFA Utsavam) వేడుక కనుల పండుగగా ప్రారంభమైంది.  జైపుర్‌ వేదికగా రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ, డిప్యూటీ సీఎం దియా కుమారితో పాటు సినీ ప్రముఖులు కరీనాకపూర్, షారుక్‌ఖాన్, కృతి సనన్, షాహిద్‌ కపూర్, కరణ్‌ జోహార్, బాబీ దేవోల్‌ తదితరులు సందడి చేశారు. ఈ వేడుకకు బాలీవుడ్‌ యువ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో ఐఫా (IIFA awards) డిజిటల్‌ అవార్డులను ప్రదానం చేశారు. ఓటీటీలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న సినిమాలు, సిరీస్‌లకు పురస్కారాలు అందించారు. ఓటీటీ సినిమాలకు సంబంధించి ఉత్తమ నటిగా కృతిసనన్‌ (Krithi sanon -దో పత్తి), ఉత్తమ నటుడిగా విక్రాంత్‌ మస్సే (Vikranth massy - సెక్టార్‌ 36) విజేతలుగా నిలిచారు. ఆదివారం సాయంత్రం జరగనున్న వేడుకలో చిత్ర రంగానికి సంబంధించి అవార్డులు అందజేయనున్నారు.


iifa.jpg

ఐఫా డిజిటల్‌ విన్నర్స్

ఉత్తమ చిత్రం: అమర్‌ సింగ్‌ చంకీలా

ఉత్తమ నటుడు: విక్రాంత్‌ మస్సే (సెక్టార్‌ 36)

ఉత్తమ నటి: కృతి సనన్‌ (దో పత్తి)

ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్‌ అలీ (అమర్‌ సింగ్‌ చంకీలా)

ఉత్తమ సహాయ నటుడు: దీపక్‌ (సెక్టార్‌ 36)

ఉత్తమ సహాయ నటి: అనుప్రియా గోయెంకా (బెర్లిన్‌)

ఉత్తమ కథ: కనికా ధిల్లాన్‌ (దో పత్తి)

Kareena.jpg

ఉత్తమ సిరీస్‌: పంచాయత్‌ సీజన్‌ 3

ఉత్తమ నటుడు: జితేంద్ర కుమార్‌ (పంచాయత్‌ సీజన్‌ 3) 

ఉత్తమ నటి: శ్రేయాచౌదరి (బందీశ్‌ బందిట్స్‌ సీజన్‌ 2)

ఉత్తమ దర్శకుడు: దీపక్‌ కుమార్‌ మిశ్రా (పంచాయత్‌ సీజన్‌ 3)

ఉత్తమ సహాయ నటుడు: ఫైజల్‌ మాలిక్‌ (పంచాయత్‌ సీజన్‌ 3)

ఉత్తమ సహాయ నటి: సంజీదా షేక్‌ (హీరామండి: ది డైమండ్‌ బజార్‌)

ఉత్తమ కథ: కోటా ఫ్యాక్టరీ సీజన్‌ 3

ఉత్తమ రియాల్టీ సిరీస్‌: ఫ్యాబ్యులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్‌: యో యో హనీ సింగ్‌: ఫేమస్‌

Updated Date - Mar 09 , 2025 | 11:34 AM