Renu Desai: నా కూతురు అనుభ‌వించిన బాధ‌.. మీ ఇంట్లో వాళ్ల‌కు వ‌స్తుంది!

ABN , Publish Date - Jun 26 , 2024 | 08:11 AM

నా శాపం మీకు త‌గులుతుంద‌ని.. మ‌మ్మ‌ల్ని ఎగ‌తాళి చేసేముందు మీ ఇండ్ల‌లోనూ ఆడ‌వాళ్లు ఉన్నార‌నే సంగ‌తి మ‌రువ‌ద్ద‌ని సోష‌ల్ మీడియా మీమ‌ర్స్‌, ట్రోల‌ర్స్‌పై రేణుదేశాయ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Renu Desai: నా కూతురు అనుభ‌వించిన బాధ‌.. మీ ఇంట్లో వాళ్ల‌కు వ‌స్తుంది!
renu desai

నా శాపం మీకు త‌గులుతుంద‌ని.. మ‌మ్మ‌ల్ని ఎగ‌తాళి చేసేముందు మీ ఇండ్ల‌లోనూ ఆడ‌వాళ్లు ఉన్నార‌నే సంగ‌తి మ‌రువ‌ద్ద‌ని సోష‌ల్ మీడియా మీమ‌ర్స్‌, ట్రోల‌ర్స్‌పై రేణుదేశాయ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. రేణు దేశాయ్ (Renu Desai), ఆద్య (Aadhya Konidela), అకీరా నందన్(Akira Nandan) లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా లో ఈమధ్య కాలంలో కామెంట్స్, ట్రోల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ట్రోల్స్ చేసే వారిపై రేణు దేశాయ్ తీవ్ర స్దాయిలో స్పందిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ వ్యంగమైన పోస్టులు ఇంకా చాలా మంది పెడుతూనే ఉన్నారు. ఇటీవలే భార్య అన్నా లెజినోవాతో అకీరా నందన్, ఆద్యలతో కలిసి పవన్ కళ్యాణ్ ఫొటో దిగటం.. అది వైరల్ అవటం‌‌ తెలిసిందే.. ఇప్పుడు సదరు ఫొటోపై కూడా కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ వేశారు. వారిపై రేణు దేశాయ్ మండిపడ్టారు.

మనుషులు ఇంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్‍స్టాగ్రామ్‌లో రేణు పోస్ట్ పెట్టారు. తన గురించి ఇష్టమొచ్చినట్టు రాసిన కామెంట్లు, మీమ్స్ చూసి తన కూతురు ఆద్య తీవ్రంగా ఏడ్చిందని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను వారి ఫొటోను ఎలా క్రాప్ చేస్తానో.. ఎలా పోస్ట్ చేస్తానో అంటూ.. మీమ్స్ వేసిన‌ వారందరికీ కూడా ఒక కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోండి. ఆద్య నన్ను ఎగతాళి చేయడాన్ని చూసి తీవ్రంగా ఏడ్చింది.సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసే వారంతా ఒక్కసారి మీ ఇళ్లలోనూ తల్లులు, అక్కాచెల్లెళ్లు ఉన్నారని గుర్తుంచుకోండి.

GQ1JKPGWkAAKz1w.jpeg


నాపై, పిల్ల‌ల‌పై చాలా అభ్యంతరకరంగా మీమ్స్, జోక్స్ వేసున్న వారికి నా శాపం ఖ‌చ్చితంగా తగులుతుంది. నా బిడ్డ ఈ రోజు అనుభవించిన బాధ, కార్చిన కన్నీరుతో మీకు చెడు ఖ‌ర్మ కచ్చితంగా తగులుతుందని గుర్తుంచుకోండి. పోలెనా, మార్క్‌లు కూడా ఈ మీమ్స్, కఠినమైన కామెంట్లతో ప్రభావితులవుతార‌న్నారు.

WhatsApp Image 2024-06-25 at 10.53.45 PM.jpeg

మీమ్ పేజ్ అడ్మిన్లకు ఈ తల్లి శాపం తగులుతుంది. నేను దీన్ని పోస్ట్ చేసే ముందు 100సార్లు ఆలోచించాను. కానీ నా కూతురు అనుభవిస్తున్న‌, అనుభ‌వించిన‌ బాధను వ్యక్తం చేసేందుకే నేనే ఇలా చెప్పాల్సి వస్తుంద‌ని’ రేణు దేశాయ్ (Renu Desai) తన ఇన్‍స్టాగ్రామ్‌లో చేసిన‌ పోస్ట్‌లో వ్రాసుకొచ్చారు.

Updated Date - Jun 26 , 2024 | 10:50 AM