Super Star: తండ్రీ కూతుళ్ళా... అన్నా చెల్లెళ్ళా!?

ABN , Publish Date - Mar 21 , 2025 | 03:09 PM

టాలీవుడ్ లో అత్యధికంగా వాణిజ్య ప్రకటనల్లో నటించేది మహేశ్ బాబే. ఇప్పుడు అతని కూతురు సితార కూడా తండ్రి బాటలో సాగుతోంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఈ యేడాది ఆగస్ట్ 9కి యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటాడు. కానీ ఇప్పటికీ థర్టీ ప్లస్ లానే కనిపిస్తుంటాడు. అదిరిపోయే ఫిజిక్ ను మెయిన్ టైన్ చేసే ప్రిన్స్ ను చూస్తే ఈ జనరేషన్ హీరోలు కూడా జెలస్ ఫీలవుతుంటారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి (Raja mouli) దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ మహేశ్ బాబు... పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ (Prudhvi Raj) కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ఇటీవల ఒరిస్సాలో పూర్తయ్యింది. మహేశ్ అక్కడ నుండి బయలు దేరి ఇలా హైదరాబాద్ లోకి ఎంట్రీ ఇచ్చాడో లేదో అలా ఒక ట్రెండీ యాడ్ ను సోషల్ మీడియాలో వదిలేశాడు. ఇందులో మహేశ్ బాబుతో పాటు అతని కూతురు సితార (Sitara) కూడా యాక్ట్ చేసింది.


ఇప్పటికే సితార సోషల్ మీడియాలో రీల్స్ తో, డాన్స్ వీడియోలతో, ఇంట్రస్టింగ్ పోస్ట్స్ తో నెటిజన్స్ ను ఫిదా చేస్తోంది. అంతేకాదు... యాడ్ వరల్డ్ లోకి సైతం సితార అడుగుపెట్టేసింది. ఇప్పటి వరకూ తెలుగు హీరోలలో అత్యధికంగా యాడ్స్ చేసిన, చేస్తున్న హీరోగా మహేశ్ బాబు నిలిచారు. గతంలో ఓ మూడేళ్ళ పాటు మహేశ్ సినిమాలు చేయనప్పుడు కూడా యాడ్స్ చేసి... ఫ్యాన్స్ ను అలరించాడు. ఏదో రకంగా టీవీల్లో అయినా తమ హీరో కనిపిస్తుండని వారు సంతృప్తి చెందారు.


ఇప్పుడు కూడా మహేశ్ బాబు నటిస్తున్న రాజమౌళి చిత్రం ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడో విడుదల అవుతుందో తెలియని పరిస్థితి. సో... ఈ టైమ్ లో మహేశ్ ను చూడాలంటే ఇలా బ్రాండ్స్ ను ప్రమోట్ చేసే అడ్వర్టైజ్ మెంట్స్ లోనే చూసి ఆనందించాలి. అయితే... తాజాగా ట్రెండ్స్ కు చేసిన యాడ్ లో మహేశ్ తో పాటు సితార కూడా నటించడం ఫ్యాన్స్ కు డబుల్ బొనంజా లాంటింది. యాడ్ మేకింగ్ లో కొత్తదనం లేకపోయినా.... తండ్రీ కూతుళ్ళ మధ్య జరిగిన ట్రెండీ టాక్ చూసే వాళ్ళకు ఆసక్తిని కలిగించింది. ఇవాళ్టి జనరేషన్ పిల్లలు పేరెంట్స్ తో ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతారో ఈ యాడ్ లో చూపించారు. చిత్రం ఏమంటే... ఈ యాడ్ చూసిన వాళ్ళంతా... మహేశ్, సితార తండ్రీకూతుళ్ళ మాదిరిగా కాకుండా అన్నా చెల్లెళ్ళ మాదిరిగా కనిపిస్తున్నారని అంటున్నారు. అంతేకాదు... మహేశ్ తో పోటీ పడుతూ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చిన సితారను ఫ్యూచర్ స్టార్ అంటూ అభినందిస్తున్నారు.

Also Read: NBK: బాలకృష్ణ సెప్టెంబర్ సెంటిమెంట్!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 21 , 2025 | 03:09 PM