Vijay: ‘జన నాయగన్’ ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా..
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:07 PM
కోలీవుడ్‌లో విజయ్‌కు (Vijay) ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అక్కడ సూపర్‌స్టార్. కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించగలడు.
కోలీవుడ్‌లో విజయ్‌కు (Vijay) ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అక్కడ సూపర్‌స్టార్. కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించగలడు. ఏ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ అయినా, అవ్వకపోయినా విజయ్ సినిమా అంటే ఎగబడి మరీ రైట్స్ కొనేస్తుంటారు. ఒకానొక టైమ్ ఓటీటీ విజృంభించింది. ఇప్పుడు కాస్త డల్ అయింది. వారు కూడా సెలెక్టివ్‌గానే సినిమాలు కొంటున్నారు. అయితే తాజాగా విజయ్ సినిమా ‘జన నాయగన్’ (Jana Nayagan) మాత్రం హాట్ కేక్‌లా అమ్ముడుపోయింది. ఈ సినిమాని అమేజాన్ ఫ్రైమ్ వీడియో (Amazon prime) సంస్థ దాదాపు రూ.120 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది కాకుండా శాటిలైట్ రూపంలో మరో రూ.55 కోట్లు వచ్చాయని కోలీవుడ్‌లో టాక్ (kollywood) నడుస్తోంది. అరంటే సినిమా విడుదలకు ముందే రూ..175 కోట్ల బిజినెస్ పూర్తయింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో ఉన్నారు. తాను చేసే చివరి చిత్రం ఇదేనని ప్రకటించారు. అందుకే ఈ సినిమాకు ఇంతగా హైప్ క్రియేట్ అయింది. పైగా దర్శకుడు హెచ్.వినోద్‌పై విజయ్‌కు బాగా నమ్మకం ఉంది. విజయ్ చివరి చిత్రం ‘గోట్’ పెద్ద ఫ్లాప్. కానీ ఆ ఎఫెక్ట్ ఈ సినిమాపై ఏమాత్రం పడలేదు. విజయ్ రెమ్యునరేషన్ కూడా దాదాపు రూ.150 కోట్లకు పైమాటే. ఆ మొత్తాన్ని ఇప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో దక్కించుకొన్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి సీజన్‌లో తమిళనాట విజయ్‌కు పెద్ద పోటీ ఉండకపోవొచ్చు. కానీ తెలుగులో కాస్త కష్టమే. ఎందుకంటే ఇక్కడ సంక్రాంతి సీజన్‌ని టార్గెట్‌గా చేసుకొని చాలా సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అందులో చిరంజీవి విశ్వంభర కూడా ఉంది.