NBK@50: బాలయ్య  సినీ స్వర్ణోత్సవ వేడుకలు .. చంద్రబాబు ట్వీట్

ABN , Publish Date - Sep 01 , 2024 | 09:12 PM

నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ (Bala Krishna) నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

Chirun.jpgహైదరాబాద్‌ నోవాలెట్‌ ఆడిటోరియమ్‌ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దీనికి నందమూరి కుటుంబ సభ్యులతోపాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రానా, నాని, సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, కె, రాఘవేంద్రరావు, మురళీమోహన్‌, విజయేంద్ర ప్రసాద్‌, అశ్వినీదత్‌, సుహాసిని, మంచు విష్ణు, మాలశ్రీ, మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మాతలు, నవీన్‌, రవిశంకర్‌, గోపీచంద్‌,  బోయపాటి శ్రీను, పి.వాసు, జయసుధ కుటుంబం,  విశ్వక్ సేన్, తదితరులు పాల్గొన్నారు.  

Nani.jpg

చంద్రబాబు ట్వీట్..

హైదరాబాద్‌ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవానికి (nbk 50 years celebrations) హాజరుకాలేతున్నానని  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. ఈ మేరకు ఆయన  ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘సినీ స్వర్ణోత్సవం జరుపుకొంటున్న నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా ఉత్పన్నమైన సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నందున హైదరాబాద్‌లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నా.

Venki.jpg

బాలకృష్ణ మరెన్నో ఘన విజయాలు సాధించాలని, తెలుగు చలన చిత్ర సీమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా మరిన్ని పాత్రలు పోషించాలి’’ అని ఆకాంక్షించారు. ఒక్కరికీ సాయం అందే వరకు జిల్లా కలెక్టర్ ఆఫీస్‌నే  సీఎం కార్యాలయంగా చేసుకుని ఇక్కడ నుంచే పని చేస్తా’’ అన్నారు.

Brahmani.jpgAllu-arju.jpg

Updated Date - Sep 01 , 2024 | 09:23 PM