Mohan Babu: గొడవలు సహజం.. మేం పరిష్కరించుకుంటాం..

ABN , Publish Date - Dec 10 , 2024 | 12:53 PM

మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదాలపై మోహన్‌బాబు స్పందించారు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని, ఇంటి గొడవలను వారు అంతర్గతంగా పరిష్కరించుకుంటారని ఆయన అన్నారు.

మంచు కుటుంబంలో (Manchu Family) జరుగుతున్న వివాదాలపై మోహన్‌బాబు (mohan Babu reaction) స్పందించారు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని, ఇంటి గొడవలను వారు అంతర్గతంగా పరిష్కరించుకుంటారని ఆయన అన్నారు. తమ ఇంట్లోనూ అలాంటి విభేదాలు వచ్చాయని, వాటిని పరిష్కరించుకుంటామని తెలిపారు. కుటుంబ వివాదం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను నేను పరిష్కరించాను. చాలా కుటుంబాలు కలిసేలా చేశాను అన్నారు మోహన్‌బాబు. (manchu family war)

మరోవైపు కుటుంబ వివాదం నేపథ్యంలో మోహన్‌బాబు నివాసంలో సన్నిహితులతో చర్చలు జరుగుతున్నాయి. జల్‌పల్లిలోని నివాసంలో సన్నిహితుల సమక్షంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌ మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. సోమవారం పెద్ద మనుషుల సమక్షంలో మోహన్‌బాబు, మనోజ్‌ వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. నేడు విదేశాల నుంచి విష్ణు తిరిగి రావడంతో ఈ ముగ్గురూ చర్చలు జరుపుతున్నారని సమాచారం.

Updated Date - Dec 10 , 2024 | 12:54 PM