NBK: అన్‌స్టాపబుల్ స్టేజ్‌పై బాలయ్య.. కానీ ఈ లుక్ ఏ సినిమాలోదో కనిపెట్టారా?
ABN , Publish Date - Oct 25 , 2024 | 09:26 PM
ఆహాలో కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ సాధించిన బాలయ్య ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ సీజన్ 4కు చేరుకుంది. సీజన్ 4 ఎపిసోడ్ శుక్రవారం సాయంత్రం గ్రాండ్‌గా మొదలైంది. ఈ షో లో బాలయ్య తను ఇప్పటి వరకు నటించిన చిత్రాలలోని కొన్ని పాత్రలలో దర్శనమిస్తానని చెప్పి.. ఓ పవర్‌ఫుల్ పాత్రని ఆడియెన్స్‌కి పరిచయం చేశారు. మరి ఆ పాత్ర, ఆ పాత్ర ఏ సినిమాలోదో తెలుసుకోవాలని ఉందా..
ఆహాలో కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ సాధించిన బాలయ్య ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ సీజన్ 4కు చేరుకుంది. సీజన్ 4 ఎపిసోడ్ శుక్రవారం సాయంత్రం గ్రాండ్‌గా మొదలైంది. అయితే గెస్ట్ కంటే ముందు బాలయ్య తన అభిమానుల కోసం ఈసారి ఓ గిప్ట్ ఇచ్చారు. ప్రతి ఎపిసోడ్‌లో తను నటించిన పాత్రలలోని కొన్నింటి వేషదారణలో వచ్చి.. డైలాగ్స్ చెబుతానని తెలిపారు. అలాగే ఈ ఫస్ట్ ఎపిసోడ్‌లో పై లుక్‌తో దర్శనమిచ్చారు. ఇంతకీ ఆహాలో బాలయ్య కనిపించిన ఈ ఫస్ట్ గెటప్ ఏ సినిమాలోదని అనుకుంటున్నారు. ఆ విషయం తెలియాలంటే.. ఎపిసోడ్‌లోకి వెళ్లాల్సిందే.
Also Read-Unstoppable With NBK: బాలయ్య పండుగకు సెలవు కావాలి.. ఇదేందయ్యా ఇది
ఈ గెటప్ ఆయన నటించిన ‘బొబ్బిలిసింహం’ సినిమాలోది. ఈ గెటప్‌లో బాలయ్య స్టేజ్‌పైకి వచ్చి ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు. ‘‘అన్యాయం చేసినవాడి చేతులు నరకడానికి మా అన్న ఉన్నాడు అని ఓ చెల్లి ఎదురుచూస్తున్నప్పుడు నేను దాదానే. పేదవాడి కడుపులో ఉన్న అన్నాన్ని లాక్కొని తినే క్యాప్టలిస్ట్ కాలర్ పట్టుకోవాల్సి వస్తే.. నేను డిక్టేటర్‌నే. ఆయుధంతోనే అవినీతిని అంతం చేయాల్సి వస్తే.. నేను విప్లవకారుడినే. చదువు ఎంతున్నా.. ఎదిగిన ఎత్తు ఎంతైనా.. తను పుట్టిన గడ్డ కోసం, తన వారి కోసం.. ఎంతటి వాడినైనా ఎదురించడమే నాయకుడి లక్షణం’’ అని బాలయ్య డైలాగ్ చెబుతుంటే.. ఈలల మోత మోగిపోయింది. న్యాయం కోసం, నిజం కోసం దేనికైనా సిద్ధపడాలని విజయరాఘవ భూపతి ‘బొబ్బిలిసింహం’లో మనకు చెప్పిన నీతి. నాటికి, నేటికి, నీతికి నేను నమ్మినదాని కోసం దేనినైనా ఎదురిస్తాను కాబట్టే.. మీ ముందు అన్‌స్టాపబుల్‌గా నిలబడ్డానని బాలయ్య చెప్పుకొచ్చారు.
ఈ సినిమాకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు అడుగుతారా? అని ఈ షో లైవ్‌గా చూస్తున్న ఆడియెన్స్‌ని బాలయ్య అడుగగా.. ఓ ఆడియెన్ ఈ సినిమా కథ మీ లైఫ్‌లో ఎంత ప్రభావం చూపించింది అని అడిగారు.
దీనికి బాలయ్య సమాధానమిస్తూ.. నిజం చెప్పాలంటే.. ఈ పాయింట్ నా నుండే పుట్టింది. నేనే రైటర్స్‌కు చెప్పి చేయించింది. నేను ఎన్నో సార్లు, ఎన్నో ప్రాంతాలకు షూటింగ్‌లకు వెళుతుంటాను. అక్కడ చదువుకున్నాడండి, సిటీ వెళ్లిపోయాడు, ఫారిన్ వెళ్లిపోయాడంటూ కొందరు చెబుతున్న మాటలు వినిపించేవి. అప్పుడు అనిపించేది.. ఎంత డబ్బున్నా, ఎంత చదువుకున్నా వాళ్ల ఊరి వారి కోసం ఫైట్ చేయాలి కదా. అందుకనే, ఆ స్ఫూర్తితోనే ‘బొబ్బిలిసింహం’ సినిమా తీశాం. అదే స్ఫూర్తితో ఇప్పుడు నేను మూడోసారి హిందూపూర్ ఎమ్మెల్యే అయ్యాను. పవర్‌లో ఉన్న పార్టీ అయినా, ఎక్స్ పార్టీ అయినా.. నేను హిందూపూర్ కోసమే నిలబడ్డాను. నా ప్రజలే నా దైవాలు. వాళ్లకోసం ఎంతదూరమైనా వెళతాను. అవసరమైతే విజయరాఘవ భూపతిని అవుతాను.. అంటూ అందరికీ వెల్‌కమ్ చెప్పారు బాలయ్య.