Prabhutvaa Junior Kalashala: యదార్థ సంఘటనల ఆధారంగా.. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′
ABN , Publish Date - Jun 14 , 2024 | 11:40 AM
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ . ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.
ప్రణవ్ ప్రీతం (Pranav Preetham), షాజ్ఞ శ్రీ వేణున్ (Shagna Sri Venun) జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ (Prabhutvaa Junior Kalashala). ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం (Sreenath Pulakuram). బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. సెన్సార్ నుంచి యూ.ఏ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ బాగుందంటూ సినీ ప్రియులు, నెటిజన్స్ నుంచి కామెంట్స్ దక్కుతున్నాయి.
ఈ ట్రైలర్‌ను చూస్తే.. వాసు (ప్రణవ్ ప్రీతం) స్నేహితులతో సరదాగా తిరుగుతుంటాడు. కాలేజీలో కుమారి అనే (షాజ్ఞ శ్రీ వేణున్) అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. ఉన్నట్టుండి వాసుతో మాట్లాడటం ఆపేస్తుంది కుమారి. వాసు ఎంత ప్రయత్నించినా కుమారి మనసు మారదు. వాసుకు కుమారి ఎందుకు దూరంగా ఉండాలనుకుంది ?. ఈ జంట తిరిగి ప్రేమలో ఒక్కటయ్యారా ? లేదా ? అనే అంశాలతో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ ట్రైలర్ ఆసక్తికరంగా కట్ చేశారు. అందమైన పల్లెటూరి విజువల్స్, ఫీల్ గుడ్ లవ్ ఎలిమెంట్స్, ఎమోషన్, మ్యూజిక్ వంటి అంశాలన్నీ ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి.