23 Movie: అనన్య ఆవిష్కరించిన పాట

ABN , Publish Date - Apr 11 , 2025 | 06:09 PM

'మల్లేశం' ఫేమ్ రాజ్ ఆర్ తెరకెక్కించిన కొత్త సినిమా '23'. నిజ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా నుండి ఓ పాట విడుదలైంది.

''మల్లేశం (Mallesam), 8 ఎ.ఎం. మెట్రో (8 A.M. Metro)' చిత్రాల దర్శకుడు రాజ్ ఆర్ (Raj R) తెరకెక్కించిన తాజా చిత్రం '23'. నిజ సంఘటన ఆధారంగా రాజ్ రూపొందించిన ఈ సినిమాను స్టూడియో 99 సంస్థ నిర్మించింది. వెంకట్ సిద్ధారెడ్డి దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాని రానా దగ్గుబాటి (Rana Daggubati) కి చెందిన స్పిరిట్ మీడియా సంస్థ పంపిణీ చేయబోతోంది. ఇందులో తేజ (Teja), తన్మయి (Tanmayi) ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు చక్కని స్పందన లభించింది. తాజాగా '23' సినిమా కోసం మార్క్ కె రాబిన్ స్వరపర్చిన 'కోసీ కొయ్యంగానే' అనే పాటను విడుదల చేశారు. దీనిని అనన్య నాగళ్ళ ఆవిష్కరించింది. వరంగల్ శంకర్ సాహిత్యాన్ని సమకూర్చగా, రేలా జాన్ సాంగ్ ను హై ఎనర్జీతో పాడారు. ఈ సాంగ్ లో లీడ్ యాక్టర్స్ రస్టిక్ డాన్స్ మూమెంట్ తో ఆకట్టుకున్నారు. ఝాన్సీ, పావోన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది.

Also Read: Oscars stunt design category: రాజమౌళి హర్షం

Also Read: Pawan Kalyan: పోస్ట్ ప్రొడక్షన్ లో హరి హర వీరమల్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 11 , 2025 | 06:11 PM