Chiranjeevi: మా బిడ్డ మార్క్ క్షేమం
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:44 AM
సింగపూర్ స్కూల్‌లోని తరగతి గదిలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
సింగపూర్ స్కూల్‌లోని తరగతి గదిలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Apdcm) కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar Pavanovich) ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. గురువారం సింగపూర్‌లో చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ.. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడన్నారు. అయితే బాబు ఇంకా కోలుకావాల్సి ఉందని పేర్కొన్నారు.
మా కులదైవం అంజనేయస్వామి దయతో.. కృపతో త్వరలోనే కోలుకొని పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ మాములుగా ఎప్పటిలాగే బాబు ఉంటాడన్నారు. శుక్రవారం..అంటే ఏప్రిల్ 11వ తేదీ హనుమన్ జయంతి అని ఈ సందర్భంగా చిరంజీవి గుర్తు చేశారు. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడని అన్నారు. మార్క్ శంకర్ కోలుకోవాలని.. వివిధ ప్రాంతాల్లోని పలు ఊళ్లలో.. ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారని.. ఆశీస్సులు అందజేస్తున్నారని చెప్పారు. ఇలా తమ కుటుంబానికి అండగా నిలబడి.. వారందరికి నా తరఫున, తమ్ముడు పవన్ కల్యాణ్ తరఫున, మా కుటుంబం యావన్మంది తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నామని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.