Pawan - Supriya: అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి కలిసిన వేళ

ABN , Publish Date - Jun 24 , 2024 | 05:50 PM

బావ.. బావ..  బుజ్జి బావ.. భామ భామ ముద్దు భామ అంటూ అల్లరి చేశారు.. ప్రియసఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి అంటూ ప్రేమ గీతాన్ని పాడుకున్నారు... పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌, నాగార్జున మేనకోడలు సుప్రియ.

Pawan - Supriya: అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి కలిసిన వేళ

బావ.. బావ..  బుజ్జి బావ.. భామ భామ ముద్దు భామ అంటూ అల్లరి చేశారు..


ప్రియసఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి అంటూ ప్రేమ గీతాన్ని పాడుకున్నారు...


పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌(Pawan kalyan) , నాగార్జున మేనకోడలు సుప్రియ. (Supriya)


'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akakda ammayi ikkada abbayi) సినిమాలోని పాటలివి.
ఈ సినిమాతో పవన్ కల్యాణ్‌ హీరోగా, సుప్రియ హీరోయిన్ గా  తెలుగు ఇండస్ట్రీకి  పరిచయమయ్యారు. ఇద్దరూ సినీ బ్యాగ్రౌండ్‌తో వచ్చినవారే కావడంతో సూపర్‌ సక్సెస్‌ అవుతారని భావించారంతా. పవన్ వరుస చిత్రాలతో స్టార్‌గా ఎదిగారు కానీ.. సుప్రియ మాత్రం ఒక సినిమాతో ఆగిపోయి  అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలు తీసుకున్నారు. పవన్ కల్యాణ్‌ తొలి హీరోయిన్ ఎవరనగానే గుర్తొచ్చే పేరు సుప్రియనే. అలాగే నా మొదటి హీరో పవన్ అని గర్వంగా చెప్పుకుంటారు సుప్రియ. తాజాగా వీరిద్దరూ ఒకే వేదికపై కలిశారు. పవన్ కల్యాణ్‌ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవిలో ఉన్న కారణంగా టాలీవుడ్‌ అగ్ర నిర్మాతలు అంతా సోమవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా పవన్ ను కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ikkadaammayiakkadaabbayi.jpg

నిర్మాతల్లో స్టూడియో సెక్టర్‌ నుంచి సుప్రియ కూడా పవన్  ను కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి ఓ ఫొటో దిగారు. అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తొలి సినిమాలో ఫొటోలు తప్ప మళ్లీ ఎక్కడ  పవన్,  సుప్రియ ఎక్కడ కలిసిన  సందర్భం, ఫోటో మెమరీ గానీ లేదు. నేడు ఇద్దరు కలిసి ఫొటో దిగడం ప్రత్యేకంగా మారింది. "ఎన్నో ఏళ్ల తర్వాత హీరో, హీరోయిన్  కలిశారు' అంటూ కొందరు కామెంట్‌ చేస్తుంటే.. మరి కొందరు కొన్ని ఫొటోలు చూస్తే అదో మాదిరి సంతృప్తిగా ఉంటుంది. రేర్‌ పిక్‌ ఇది' అని కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్, సుప్రియ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Updated Date - Jun 24 , 2024 | 06:38 PM