Tejaswini Nandamuri: నాన్నలో ఎవరూ చూడని సైడ్‌ చూస్తారు

ABN , Publish Date - Oct 12 , 2024 | 05:44 PM

'‘నాన్న మొదటిసారి 'అన్‌స్టాపబుల్‌' (unstoppable 4) షో చేస్తున్నప్పుడు ‘బాలకృష్ణ (NBK) పర్సనాలిటీకి నప్పుతుందా? లేదా’ అని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన ధైర్యంగా ముందుకొచ్చి చేశారు.

Tejaswini Nandamuri: నాన్నలో ఎవరూ చూడని సైడ్‌  చూస్తారు

'‘నాన్న మొదటిసారి 'అన్‌స్టాపబుల్‌' (unstoppable 4) షో చేస్తున్నప్పుడు ‘బాలకృష్ణ (NBK) పర్సనాలిటీకి నప్పుతుందా? లేదా’ అని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన ధైర్యంగా ముందుకొచ్చి చేశారు. ఇప్పుడు ఇండియాలో ఇది మోస్ట్‌ పాపులర్‌ షో అయింది’’ అని బాలకృష్ణ తనయ తేజస్వినీ అన్నారు. బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓటీటీ షో అన్‌స్టాపబుల్‌ ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే. ఇప్పటికి మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్‌ ఈ  నెల 24న ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా శనివారం  అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తేజస్వి (Tejaswini Nandamuri) మాట్లాడుతూ ‘నాన్న మొదటిసారి ఈ షో చేస్తున్నప్పుడు ‘బాలకృష్ణ పర్సనాలిటీకి నప్పుతుందా? లేదా’ అని కామెంట్‌ చేశారు. అవేమీ పట్టించుకోకుండా ఆయన ధైర్యంగా ముందుకు వచ్చి చేశారు. ఇప్పుడు ఇండియాలో మోస్ట్‌ పాపులర్‌ షో అయింది. ఈ షో తో నాన్నగారిలో ఎవరూ చూడని సైడ్‌ చూస్తారు. ఆయన చేయని జానర్‌ లేదు. వేయని గెటప్‌ లేదు. ఇప్పుడు హిందూపురం హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే ఆయన. అందరికీ అండగా నిలబడతారు. నిత్యం నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తారు. బసవతారకం క్యాన్సర్‌ హాస్పటల్‌కు వెళ్తే, అక్కడున్న పేషెంట్లు ‘ఇది నిజంగా దేవాలయం అమ్మా’ అంటారు. బసవతారకం ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులు కూడా ఉండటం ఇందుకు ఒక కారణం. ఇక అన్‌స్టాపబుల్‌కు వస్తే సీజన్‌-4 ఏం చేస్తారా? అని అందరూ చూస్తున్నారు. మీరు ఊహించని స్థ్థాయిలో ఈ షో ఉంటుంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్‌ షూట్‌ కూడా చేశాం. ఇప్పుడు మీరు చూసింది కేవలం ట్రెలర్‌ మాత్రమే’’ అని అన్నారు.

Nandamuri Balakrishna: గత సీజన్‌లతో పోలిస్తే.. దబిడిదిబిడే


Updated Date - Oct 12 , 2024 | 05:49 PM