Hasini Sudheer: ‘పురుషోత్తముడు’లో రాజ్ తరుణ్‌తో నటించినా.. నా ఫేవరేట్ హీరో ఎవరంటే?

ABN , Publish Date - Jul 25 , 2024 | 10:19 PM

రాజ్ తరుణ్ హీరోగా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ‘ఆకతాయి’, ‘హమ్ తుమ్’ చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర విశేషాలను హీరోయిన్ హాసిని సుధీర్ మీడియాకు తెలియజేసింది.

Heroine Hasini Sudheer

రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu). ఈ చిత్రంతో హాసిని సుధీర్ (Hasini Sudheer) హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ‘ఆకతాయి’, ‘హమ్ తుమ్’ చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన (Ram Bheemana) ఈ చిత్రానికి దర్శకుడు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 26వ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ హాసినీ సుధీర్ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ..

Also Read- 30 Years Prudhvi: ఢిల్లీలో జగన్‌ని ఆ ప్రశ్న అడిగిన విలేఖరిని అభినందించా..

‘‘నేను మహారాష్ట్ర అమ్మాయిని. హీరోయిన్ కావాలనేది నా చిన్నప్పటి డ్రీమ్. ముంబైలో మోడలింగ్ చేశాను. తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. అలా తెలుగు నేర్చుకున్నాను. నాని నా ఫేవరేట్ యాక్టర్. డైరెక్టర్ రామ్ భీమన గారు ‘పురుషోత్తముడు’ సినిమా ఆడిషన్‌కు పిలిచారు. ఆడిషన్ తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు. ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యాక ఏడాది పాటు వర్క్‌షాప్‌లో పాల్గొన్నాను. ఈ చిత్రంలో నేను అమ్ములు అనే క్యారెక్టర్ చేశాను. అంతా అమ్ము అని పిలుస్తారు. తనొక బబ్లీ గర్ల్. అందరితో పని చేయిస్తుంటుంది. హీరోతో కూడా పని చేయిస్తుంది. ఈ క్యారెక్టర్‌లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. నాకు తెలుగు మాట్లాడటం వచ్చినా చదవడం రాదు. రాజమండ్రి షెడ్యూల్ కోసం వెళ్లి ఫస్ట్ డే షూట్‌లో పాల్గొన్పప్పుడు ఇబ్బంది పడ్డాను. సినిమాలో అంతా సీనియర్స్ నటించారు.. వాళ్లంతా ఎంతో సపోర్ట్ చేశారు. (Hasini Sudheer About Purushothamudu)


Hasini-Sudheer-Pic.jpg

రాజ్ తరుణ్‌తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. సెట్స్‌లో తన సపోర్ట్ అందించేవారు. మా డైరెక్టర్ రామ్ భీమనకు థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్స్ మమ్మల్ని అందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకున్నారు. నా మొదటి చిత్రంలోనే చాలా మంది పెద్ద ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ కళ్లతోనే నటిస్తారు. నేనూ అలా నటించాలని అనుకునేదాన్ని.

ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అందరూ ఫ్యామిలీతో వెళ్లి ఈ సినిమాను చూడాలని కోరుతున్నాను. ఈ సినిమాను ఒక ఆడియెన్‌గా చూసినప్పుడు హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే ఫీల్ కలిగింది. తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ తక్కువ మంది ఉన్నారు. తెలుగమ్మాయిని కాకున్నా తెలుగు మాట్లాడుతున్నందువల్ల నన్ను ఇక్కడి అమ్మాయిలాగే చూస్తున్నారు. తెలుగు సినిమాల్లో హీరోయిన్స్‌ను అందంగా చూపిస్తారు. అందుకే నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం. లవ్ స్టోరీస్‌తో పాటు యాక్షన్ మూవీస్ కూడా చేయాలని ఉంది. ప్రస్తుతం కొన్ని సినిమాల ఆఫర్స్ వస్తున్నాయి. మీ అందరి సపోర్ట్ నాకూ, మా సినిమాకు అందిస్తారని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

Read Latest Cinema News

Updated Date - Jul 25 , 2024 | 10:22 PM

Purushothamudu: ఐ ఫీస్ట్ లాంటి సినిమా 

Purushothamudu: ఇంత‌వ‌ర‌కు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. రాని పాయింట్‘పురుషోత్తముడు’

Purushothamudu: ‘పురుషోత్తముడు’ మూవీ టీజర్

Purushothamudu: ‘పురుషోత్తముడు’ మూవీ థియేట్రికల్ ట్రైలర్

Purushothamudu: ‘పురుషోత్తముడు’లోని ఇలా ఇలా.. లిరికల్ సాంగ్