Anil Ravipudi: నాలుగు పిల్లర్స్‌తో సినిమాలు.. ఆ రికార్డ్‌ నాదే!

ABN , Publish Date - Jan 22 , 2025 | 09:53 PM

‘సంక్రాంతికి వస్తున్నాం’ మామూలు సక్సెస్‌ కాదు. ఆరు రోజుల్లో వందకోట్ల షేర్‌, వన్‌ వీక్‌ లో 200 కోట్లు క్రాస్‌ చేయడం అంటే ఓ అద్భుతం. ఇది నా కెరీర్‌లో హిస్టరీ.

Anil Ravipudi: నాలుగు పిల్లర్స్‌తో సినిమాలు.. ఆ రికార్డ్‌ నాదే!


"ఈ పదేళ్ళు ప్రతి సినిమా ఒక వండర్‌ ఫుల్‌ ఎక్సపీరియన్స్‌. ప్రతి హీరోతో ఒక  అద్భుతమైన రిలేషన్‌. నేను ఏ జోనర్‌ సినిమా చేసిన ఆడియన్స్‌ గొప్పగా సపోర్ట్‌ చేశారు. ప్రతి సినిమాకి ఒకొక్క మెట్టు ఎక్కిస్తూ ఫైనల్‌ గా ఈ పొంగల్‌ కి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో (Sankranthiki Vastunnam) ఓ అద్భుతమైన విజయం ఇచ్చారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విక్టరీ నా కెరీర్‌లో ఓ హిస్టరీ’ అన్నారు అనిల్‌ రావిపూడి అన్నారు. దర్శకుడిగా ఆయన జర్నీకి జనవరి 23తో పదేళ్ళు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. (10Years Of anil Ravipudi)


ఈ పదేళ్ల జర్నీ బెస్ట్‌ మెమరీస్‌ ఇచ్చింది. లక్కీగా ఆడియన్స్‌ సపోర్ట్‌తో హైలోనే ఉన్నాను. నేను ఏ జోనర్‌ సినిమా చేసిన ఆడియన్స్‌ గొప్పగా సపోర్ట్‌ చేశారు. ప్రతి సినిమాకి ఒకొక్క మెట్టు ఎక్కిస్తూ ఫైనల్‌గా ఈ పొంగల్‌ కి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో అద్భుతమైన విజయం ఇచ్చారు. ఈ క్రెడిట్‌తో అంతా ఆడియన్స్‌కే ఇస్తాను. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మామూలు సక్సెస్‌ కాదు. ఆరు రోజుల్లో వందకోట్ల షేర్‌, వన్‌ వీక్‌ లో 200 కోట్లు క్రాస్‌ చేయడం అంటే ఓ అద్భుతం. ఇది నా కెరీర్‌లో హిస్టరీ. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి ఈ బం వుందని ఆడియన్స్‌ చాలా స్ట్రాంగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

కళ్యాణ్‌ రామ్‌  లేకపొతే నా కెరియర్‌ లేదు
దర్శకుడు కావడం అనేది నా డ్రీమ్‌. అది ‘పటాస్‌’ తో తీరిపోయింది. ఇదంతా బోనస్‌గా భావిస్తున్నాను. నాకు లైఫ్‌ ఇచ్చింది ఆడియన్స్‌. వారికి పైసా వసూల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఇవ్వడమే నా టార్గెట్‌. అదే చేసుకుంటూ వస్తున్నాను. నా గోల్‌కి రీచ్‌ అయ్యాను. ఈ పదేళ్ళు ప్రతి సినిమా ఒక వండర్‌ ఫుల్‌ ఎక్సపీరియన్స్‌. ప్రతి హీరోతో ఒక అద్భుతమైన రిలేషన్‌. కళ్యాణ్‌ రామ్‌గారు లేకపొతే నా కెరియర్‌ లేదు. ఆయన ప్రొడ్యూస్‌ చేసి నన్ను డైరెక్టర్‌గా నిలబెట్టారు. ఈ పదేళ్ళ క్రెడిట్‌ ముందు కళ్యాణ్‌ రామ్‌ గారికి ఇస్తాను. తర్వాత సాయిధరమ్‌ తేజ్‌తో సుప్రీం, రవితేజ గారితో రాజా ది గ్రేట్‌, వెంకటేష్‌ గారితో ఎఫ్‌2, మహేష్‌ గారితో సరిలేరు నీకెవ్వరు, మళ్లీ వెంకీ గారితో ఎఫ్‌3, బాలకృష్ణ గారితో  భగవంత్‌ కేసరి ఇప్పుడు వెంకటేశ్‌ గారితో ుసంక్రాంతికి వస్తున్నాం’ ప్రతి హీరోతో ప్రతి సినిమా ఒక మెమరబుల్‌ ఎక్స్‌ పీరియన్స్‌. నేను సినిమాలు చూస్తూ విజిల్స్‌ కొట్టిన హీరోలతో కలిసి పనిచేయడం అల్టిమేట్‌ ఫీలింగ్‌.  

ఆ ప్రేమే నా  ఆస్తి

‘సంక్రాంతికి వస్తున్నాం’కు వస్తున్న కాంప్లిమెంట్స్‌ చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఫీలవుతున్నాను. ‘మా అమ్మ ముఫ్పై ఏళ్ల తర్వాత సినిమాకి వచ్చింది’ అని ఓ ఫ్రెండ్‌ ఫోటో షేర్‌ చేస్తూ మెేసజ్‌ పెట్టాడు. కొంతమంది వీల్‌ చైర్‌ లో వచ్చీ మరి సినిమా చూశారు. సినిమాకి దూరమైన ఆడియన్స్‌ మళ్ళీ థియేటర్‌కి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది ఫ్యామిలీ జోనర్‌కి వున్న బలం. ఫ్యామిలీ జోనర్‌ నా స్ర్టెంత్‌. ఈ జోనర్‌ లో సినిమా చేసినప్పుడు ఇంకాస్త కాన్ఫిడెంట్‌గా అల్లరి చేస్తూ మంచిగా తీస్తాను. ఎంటర్‌టైన్మెంట్‌ ఆయన్స్‌ నాకు ఇచ్చిన వెపన్‌. దాన్ని లైఫ్‌ లైన్‌గా ఎప్పుడూ వాడుకుంటాను. అభిమానులు చూపించే ప్రేమే నేను సంపాదించుకున్న ఆస్తి. దీన్ని సినిమా సినిమాకి పెంచుకుంటూ వెళ్తున్నా. సంక్రాంతికి వస్తున్నాం తో నా ఆస్తి విలువేంటో ఆడియన్స్‌ మళ్ళీ చూపించారు. ఆడియన్స్‌ ప్రేమ పరంగా నేను మల్టీ మిలీనియర్‌ని.


ఆడియన్స్‌ ఇచ్చిన గొప్ప తీర్పు..

 'సంక్రాంతికి వస్తున్నాం’ కథ అనుకున్నప్పుడు 'ఎఫ్‌ 2’లాంటి మంచి ఎంటర్‌టైనర్‌ తీద్దామని అనుకున్నాను. 'ఎఫ్‌ 2'లా ఆడితే చాలనుకున్నా. ఇది మా అంచనాలకు మించి అవుతుంది. ఎనిమిదో రోజు కూడా సినిమా ఫిగర్స్‌, రెవెన్యు షాకింగ్‌గా వుంది. ఇది చాలా సర్‌ ప్రైజింగ్‌గా ఉంది. ఫైనల్‌ నెంబర్‌ కూడా అందరూ సర్‌ ప్రైజ్‌ అయ్యే నెంబర్‌ ఉండబోతోంది. ఇది వెంకటేష్‌ గారికి, మా టీం అందరికీ ఆడియన్స్‌ ఇచ్చిన గొప్ప తీర్పు.


Anil.jpg
సీజన్‌ 20శాతం అడ్వాంటేజ్‌ ఉంటుంది. 80శాతం కంటెంట్‌ లో విషయం ఉండాలి. సీజన్‌ సినిమాని కాపాడుతుందని నేను ఎప్పుడు నమ్మను. సినిమా బాగుంటే మాత్రం నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఆ అడ్వాంటేజ్‌ ప్రతి సినిమాకి ఉంటుంది. ఈ సినిమాలో కంటెంట్‌ పరంగా మేము కొత్తగా ఫీల్‌ అయింది ఒక భార్య,  మాజీ ప్రేయసితో ఒక వ్యక్తి ప్రయాణం. ఈ మధ్యకాలంలో ఇలాంటి టెంప్లేట్‌ నేను ఎక్కడా చూడలేదు. ఇది చాలా ఫ్రెష్‌గా ఫీల్‌ అయ్యారు. అది సినిమా అంతటా కమ్యూనికేట్‌ చేయగలిగాను. ఆడియన్స్‌ కంటెంట్‌ ని కొత్తగా ఫీల్‌ అవ్వడం వల్లే ఇంత గొప్ప జడ్జిమెంట్‌ ఇచ్చారని భావిస్తున్నాను. ప్రమోషన్స్‌ కూడా చాలా ప్లాన్డ్‌ గా చేశాం.. నాతోపాటు వెంకటేష్‌ గారు జాయిన్‌ అవ్వడం అనేది ఒక అద్భుతం. ఆయనకున్న స్టార్‌డమ్‌కి రీల్స్‌ చేయడం, స్కిట్స్‌ చేయడం.. ఇవన్నీ పబ్లిక్‌ పరిశీలించారు. ఈ సినిమాలో ఏదో ఉంది వెళ్లి చూడాలనే ఆసక్తి ఆడియన్స్‌లో కలిగింది.

ఈ సినిమా సక్సెస్‌తో అనిల్‌ మమల్ని నిలబెట్టారని చెప్పడం ఆనందంగా ఉంది. అయితే నిలబెట్టింది నేను కాదు. ప్రేక్షకులు. ఈ క్రెడిట్‌ అంతా వారికే ఇస్తాను.  దిల్‌ రాజు గారు ఎన్నో అద్భుతమైన సక్సెస్‌లు ఇచ్చారు. ఈ విజయంతో ఆడియన్స్‌ వారిని నిలబెట్టారు. సినిమాకి బళ్ళు కట్టుకొని వచ్చి చూశారు. ఈ సినిమా విజయం ఓ వండర్‌. ఓ కేస్‌ స్టడీ. ఈ సినిమా ఎందుకు ఇంతపెద్ద హిట్‌ అయ్యిందో నేను కేస్‌ స్టడీగా పెట్టుకోవాలి. మేమంతా సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాం.

పదేళ్ల జర్నీలో నాలో ఎలాంటి మార్పు లేదు. ఇంతకు ముందు ప్రతిదానికి రియాక్ట్‌ అయ్యేవాడిని. ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. వర్క్‌ పైనే ఫోకస్‌ చేస్తాను. ప్రతి శుక్రవారం వచ్చే సినిమాలు చూస్తాను. నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటే నేర్చుకుంటాను. ఇది ఈ పదేళ్ళుగా చేస్తున్నాను.

చిరంజీవి గారితో చేయబోయే సినిమా గురించి ఇప్పుడే మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది. ఎలాంటి జోనర్‌లో చేయాలనే టాక్స్‌, హోమ్‌ వర్క్‌ జరుగుతుంది. వందశాతం అందరూ ఊహించినదానికంటే ఎక్కువగా చిరంజీవి గారిని ప్రజెంట్‌ చేయాలనే విల్‌ పవర్‌ తో వున్నాను.  నాగార్జున గారితో వందశాతం చేస్తాను. ఆయనతో హలో బ్రదర్‌ లాంటి సినిమా చేయాలనివుంది. నేను చూసిన ఫోర్‌ పిల్లర్స్‌తో నాలుగు సినిమాలు చేశాననే రికార్డ్‌ కూడా నాకు వుంటుంది. 

Updated Date - Jan 22 , 2025 | 09:53 PM