పరిపూర్ణమైన తెలుగు సినిమా
ABN , Publish Date - Apr 02 , 2025 | 05:05 AM
ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈనెల 18న విడుదలవుతోంది...
ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈనెల 18న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ ‘‘నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌తో ఇది నాకు మూడో సినిమా. కుటుంబసమేతంగా చూడదగ్గ హాస్యభరిత చిత్రమిది. ఈ సినిమా విజయంపై నమ్మకం ఉంది’’ అని అన్నారు. ‘‘చాలా రోజులుగా మంచి తెలుగు సినిమా తీయాలనుకుంటున్నాను. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. కేవలం జాతకాలనే నమ్మకూడదు.. మనం చేయాల్సిన పనులను వందశాతం నిబద్ధతతో చేయాలని చెప్పే సినిమా ఇది’’ అని శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు.