ఇది ప్రేక్షకుల విజయం

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:10 AM

నిర్మాత సూర్యదేవర నాగవంశీ సమర్పణలో సాయిసౌజన్య, హారికా సూర్యదేవర నిర్మించిన తాజా చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌నితిన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు...

నిర్మాత సూర్యదేవర నాగవంశీ సమర్పణలో సాయిసౌజన్య, హారికా సూర్యదేవర నిర్మించిన తాజా చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌నితిన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ ‘‘ఇందులోని వినోదం నచ్చడంతో యువత, కుటుంబ ప్రేక్షకులు సినిమా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ముందుగానే చెప్పినట్లు ఇది ప్రేక్షకులను నవ్వించడానికి చేసిన ప్రయత్నం. ఈ సినిమా విజయం ప్రేక్షకులదే. రివ్యూ అనేది ఒకరి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. సినిమాలకు నిజాయితీగా ఇచ్చే రివ్యూలను స్వాగతిస్తాము. కానీ సినిమాను చంపేయాలనే ఉద్దేశంతో కొందరు లేనిపోనివి రాస్తూ.. దెబ్బతీస్తున్నారు. సినిమా బతికితేనే మనమందరం బాగుంటాం అనే విషయాన్ని గ్రహించాలి’’ అని అన్నారు.


ఆ సినిమాలపై క్లారిటీ

‘‘అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ సినిమా పూర్తిగా పురాణాల నేపథ్యంలో సాగనుంది. అక్టోబరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం కానుంది. విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్‌’ సినిమాలో యాక్షన్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇందులోని పోరాట ఘట్టాలు ‘కేజీఎఫ్‌’ సినిమా స్థాయిలో ఉంటాయి. రవితేజ నటిస్తున్న ‘మాస్‌ జాతర’ సినిమాను జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నాగవంశీ చెప్పారు.

Updated Date - Apr 02 , 2025 | 05:10 AM