Chandini Tamilarasan: ‘నో’ చెబితే టచ్‌ చేసే సాహసం చేయరు

ABN , Publish Date - Jan 30 , 2025 | 09:01 AM

హీరోయిన్లకు ఎక్స్‌పోజింగ్‌ అవసరమా? అంటే, అవసరమే అంటోంది చాందిని తమిళరసన్. జెనీలియా పోలికలతో ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ యువ నటి.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులపై సూటిగా చెప్పుకొచ్చింది. ఆమె ఏమందంటే..

Chandini Tamilarasan

‘‘సినిమా పరిశ్రమ సురక్షితమైంది. ఇక్కడ మనల్నికాదని ఏదీ జరగదు. ‘నో’ చెబితే ఎవరూ టచ్‌ చేసేందుకు సాహసించరు. నో మీన్స్‌ నో.. వద్దు అంటే ఇక్కడ వద్దనే’’ అని చిత్ర పరిశ్రమలోని క్యాస్టింగ్‌ కౌచ్‌పై యువ హీరోయిన్‌ చాందిని తమిళరసన్‌ కుండబద్ధలు కొట్టారు. ‘సిద్ధు ప్లస్‌-2’తో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ.. ‘నాన్‌ రాజావాగ పోగిరేన్‌’, ‘విల్‌ అంబు’, ‘కట్టాప్పావై కాణోమ్‌’, ‘మన్నర్‌ వాగైయ్యా’, ‘కసడ తపర’ వంటి అనేక చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘బుజ్జి ఇలా రా’, ‘రామ్ అసుర్’ వంటి చిత్రాలలో నటించి.. తెలుగు ప్రేక్షకులకూ ఈ భామ పరిచయమైంది. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ యువ నటి.. ప్రస్తుతం తమిళంతో పాటు టాలీవుడ్‌లోనూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మనసువిప్పి మాట్లాడారు.


Chandini-1.jpg

మీ సినీ ప్రయాణం ఎలా సాగుతోంది?

సినిమా అనేది మహాసముద్రం. దీన్ని ఈదడం కష్టం. నా సినీ జర్నీ ఊహించనిది. నా ఫ్యామిలీకి సినీ నేపథ్యం లేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగానికి వెళ్లాలన్నదే కుటుంబ సభ్యుల కోరిక.

తొలి ఛాన్స్‌ ఎలా వచ్చింది?

ప్లస్‌ వన్‌ చదువుకునే సమయంలో ‘మిస్‌ చెన్నై’ పోటీల్లో పాల్గొని మూడో స్థానంలో నిలిచా. ఆ తర్వాత సినీ అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఒక రోజు ‘సిద్ధు ప్లస్‌-2’ కోసం దర్శకుడు భాగ్యరాజ్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఆయన్ను కలిసిన తర్వాత సినిమాలో ఎంపిక చేశారు. కానీ, భయం కారణంగా అవకాశాన్ని వద్దని చెప్పా. కొద్ది రోజులకు ఏ ఒక్కరూ హీరోయిన్‌ పాత్రకు సరిపడకపోవడంతో మళ్లీ ఆ అవకాశం నాకే వరించింది. అలా తొలి అవకాశం దక్కింది.

మనసును గాయపరిచిన సందర్భం ఉందా?

పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో నేను కాస్త బొద్దుగా ఉన్నానంటూ హేళన చేశారు. ఇలా కామెంట్స్‌ చేయడం బాధనిపించింది. స్కూల్‌ చదువుకునే రోజులు కావడంతో అపుడు కాస్త లావుగానే ఉన్నా. ఆ తర్వాత ఆహార నియమాలు పాటించి నాజూగ్గా తయారయ్యా.


Also Read- Pushpa 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘పుష్ప 2 రీ లోడెడ్’.. నీ యవ్వ ఇక తగ్గేదే లే..


సినీ పరిశ్రమలో మీరు కోరుకునే మార్పు ఏంటి?

అనేక మంది ప్రతిభావంతులైన కళాకారులు, నటీనటులకు సరైన అవకాశాలు లభించడం లేదు. గొప్ప టాలెంట్‌ ఉన్న వారికి అవకాశాలు నిరాకరిస్తున్నారు. సినిమాల విజయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, నటీనటుల ప్రతిభకు అవకాశాలివ్వాలి.

హీరోయిన్లకు ఎక్స్‌పోజింగ్‌ అవసరమా?

కచ్చితంగా.. ఎక్స్‌పోజింగ్‌ కావాలి. హీరోయిన్లకు అన్ని అంశాలతో పాటు అందాల ఆరబోత ముఖ్యం. టూపీస్‌ దుస్తులు ధరించడం మాత్రమే ఎక్స్‌పోజింగ్‌ కాదు. ముఖంలో భావాలను వ్యక్తం చేయాలి. క్లోజ్‌అప్‌ షాట్‌లో కూడా ఎక్స్‌పోజింగ్‌ చేయవచ్చు. ముఖ్యంగా స్టోరీ డిమాండ్‌ చేస్తే గ్లామర్‌గా నటించాల్సిందే.

పాన్‌ ఇండియా చిత్రాల్లో ఎప్పుడు నటిస్తారు?

పాన్‌ ఇండియా చిత్రాల్లో నటించడమే నా లక్ష్యం కాదు. నాకు అవకాశం లభించే ప్రతి చిత్రంలోనూ బాగా నటించి అందరితో శెభాష్‌ అనిపించుకోవాలి.

మీ బలం.. బలహీనత ఏంటి?

నా బలం పట్టుదల (విడాముయర్చి). నా బలహీనత సాఫ్ట్‌ నేచర్‌.


Chandini-2.jpg

పేరు: చాందిని తమిళరసన్‌

నిక్‌ నేమ్‌: డింపు

పుట్టిన తేది: ఆగస్టు 12

పుట్టిన ఊరు: చెన్నై

ఎత్తు: 5.6 అడుగులు

ఇష్టమైన హీరో: అజిత్‌ కుమార్‌

ఇష్టమైన నటి: జ్యోతిక

ఇష్టమైన ఆహారం: మటన్‌ బిర్యానీ

ఇష్టమైన దుస్తులు: కుర్తా, లెగ్గిన్స్‌

లక్కీ నెంబర్లు: 3, 6


Also Read- Fatima Sana Shaikh: ఓ తెలుగు నిర్మాత పచ్చిగా అడిగాడు.. ‘దంగల్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

Also Read- Mega Star Chiranjeevi: ఫస్ట్ షూటింగ్ నాదే..

Also Read- Balakrishna: 'హిట్ 4'లో హీరోగా బాలయ్య?

Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 09:01 AM