భావోద్వేగాలతో నిండిన ప్రేమకథ
ABN , Publish Date - Apr 02 , 2025 | 05:08 AM
నూతన నిర్మాత సాయి అభిషేక్ రూపొందించిన చిత్రం ‘28 డిగ్రీస్ సెల్సియస్’. నవీన్‌చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా ‘పొలిమేర’ ఫేమ్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. ఈనెల 4న సినిమా విడుదలవుతున్న...
నూతన నిర్మాత సాయి అభిషేక్ రూపొందించిన చిత్రం ‘28 డిగ్రీస్ సెల్సియస్’. నవీన్‌చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా ‘పొలిమేర’ ఫేమ్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. ఈనెల 4న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సాయి అభిషేక్ మీడియాతో ముచ్చటించారు. ‘‘దర్శకుడు అనిల్‌తో కలసి ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందిద్దామని చేసిన ప్రయత్నమే ఈ థ్రిల్లర్. భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. కథపై పూర్తి నమ్మకం ఉండడంతో నిర్మాణపరంగా రాజీపడలేదు. నవీన్ చంద్ర ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు. ఓ తీవ్ర అనారోగ్య సమస్య నుంచి హీరోయిన్‌ను హీరో ఎలా రక్షించుకున్నాడు అనేది కథాంశం. విభిన్న జానర్స్‌లో సాగుతూ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే అద్భుత ప్రేమకథ ఇది’’ అని చెప్పారు.