Vettaiyan: వేట్ట‌యాన్ రికార్డుల వేట‌.. 4రోజుల్లో వ‌సూళ్లు ఎంతంటే!

ABN , Publish Date - Oct 15 , 2024 | 06:20 AM

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.

vettayan

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’(Vettaiyan).ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేసింది. గ్లోబల్ గా అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ రిలీజైన కొద్ది రోజుల్లోనే 240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైల్ స్టోన్ అని చెప్పుకోవడమే గాక, ఇండియన్2 డిజాస్ట‌ర్ త‌ర్వాత లైకా ప్రొడ‌క్ష‌న్స్ కి మంచి బూస్టింగ్ ఇచ్చింది.

GZ28ckTX0AQSse5.jpeg

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ (Lyca Productions) నిర్మాణంలో సుభాస్క‌ర‌న్ నిర్మాతగా టి.జె.జ్ఞాన‌వేల్ (TJ Gnanavel.) ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమాలో న్యాయం, అధికారం, ఎన్‌కౌంటర్ హత్య, అవినీతి విద్యా వ్యవస్థ ఇతివృత్తాలను ఎంతో పవర్ ఫుల్ గా చూపించారు. ప్రతి షాట్‌లో డైరెక్టర్ టేకింగ్ హైలైట్ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహిద్ ఫాజల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుశారా విజయన్ నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ప్రతి యాక్టర్ కూడా తన ఎనర్జిటిక్ పర్ఫార్‌మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలకం అయింది.

WhatsApp Image 2024-10-14 at 8.29.29 PM (1).jpeg

ఈ సినిమాకు వస్తున్న స్పందనను చూసి నిర్మాత సుభాస్కరన్ ప్రేక్షక లోకానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల మద్దతుతో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ తో పాటు తారాగణం మొత్తానికి గుర్తుండిపోయే చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని చెప్పుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. వెట్టయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ₹240 కోట్లను అధిగమించడం, ఇటీవలి కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా అవతరించడం విశేషం. ఈమేర‌కు మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. అనంత‌రం చిత్ర యూనిట్ అంతా ర‌జ‌నీకాంత్‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు.

Updated Date - Oct 15 , 2024 | 06:20 AM