విచారణకు భయపడం

ABN , Publish Date - Apr 06 , 2025 | 03:47 AM

‘నా కొడుకు ఏ తప్పూ చేయలేదు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధం. భయపడాల్సిన అవసరం మాకు లేదు’ అని మలయాళ నటుడు, దర్శకుడు...

‘నా కొడుకు ఏ తప్పూ చేయలేదు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధం. భయపడాల్సిన అవసరం మాకు లేదు’ అని మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తల్లి మల్లిక సుకుమారన్‌ స్పష్టం చేశారు. మార్చి 29 ఆదాయపు పన్ను శాఖ అధికారులు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కు నోటీసులు జారీ చేయగా, ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దీనిపై మల్లిక స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. కాగా, 2022లో పృథ్వీరాజ్‌ నటించిన మూడు చిత్రాలు ‘కడువ’, ‘జనగణ మన’, ‘గోల్డ్‌’ విడుదలయ్యాయి. ఈ చిత్రాలకు సహనిర్మాతగా కూడా వ్యవహరించిన పృథ్వీరాజ్‌ నటుడిగా ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. అయితే ఆ వివరాలను ఈనెల 29వ తేదీలోగా తెలియజేయాలంటూ ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Updated Date - Apr 06 , 2025 | 03:47 AM