రేయి లోలోతుల..
ABN , Publish Date - Apr 06 , 2025 | 03:50 AM
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్...
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శనివారం రష్మిక పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా నుంచి పోస్టర్, టీజర్ సాంగ్ ‘రేయి లోలోతుల’ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రష్మిక చేతిలో కత్తి పట్టుకొని, నడుమున గన్‌తో శక్తిమంతంగా కనిపిస్తున్నారు. ‘రేయి లోలోతుల’ పాటకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించడంతో పాటు విజయ్ దేవరకొండ, చిన్మయి శ్రీపాదతో కలసి ఆలపించారు.