స్వచ్ఛమైన ప్రేమకథ
ABN , Publish Date - Apr 06 , 2025 | 03:45 AM
రాజేశ్ కొంచాడా, శ్రావణి శెట్టి జంటగా స్వామి పట్నాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కౌసల్య తనయ రాఘవ’. అడపా రత్నాకర్ నిర్మాత...
రాజేశ్ కొంచాడా, శ్రావణి శెట్టి జంటగా స్వామి పట్నాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కౌసల్య తనయ రాఘవ’. అడపా రత్నాకర్ నిర్మాత. ఈనెల 11న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో రాజేశ్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. అందరూ చూసి ఆదరించాలని కోరుతున్నా’ అని అన్నారు. చిత్ర దర్శకుడు స్వామి పట్నాయక్ మాట్లాడుతూ ‘నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు’ అని చెప్పారు. నిర్మాత రత్నాకర్ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని స్వామి పట్నాయక్ అద్భుతంగా తెరకెక్కించారు’ అని ప్రశంసించారు.