Rajinikanth: 33 ఏళ్ల విరామం తర్వాత..

ABN , Publish Date - Oct 07 , 2024 | 10:26 AM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth).. 'వేట్టయాన్‌' (Vettaiyan) చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో చిత్రం 'కూలీ' (Coolie) చిత్రీకరణ చివరి దశలో ఉంది. ప్రస్తుతం తలైవాకు సంబంధించి ఓ వార్త నెట్టంట వైరల్‌ అవుతోంది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth).. 'వేట్టయాన్‌' (Vettaiyan) చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో చిత్రం 'కూలీ' (Coolie) చిత్రీకరణ చివరి దశలో ఉంది. ప్రస్తుతం తలైవాకు సంబంధించి ఓ వార్త నెట్టంట వైరల్‌ అవుతోంది. దర్శకుడు మణిరత్నంతో ఆయన మళ్లీ చేతులు కలపనున్నారని తెలుస్తోంది. 33 ఏళ్ల విరామం తర్వాత ఇద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుందని కోలీవుడ్‌లో మీడియా కోడై కూస్తోంది.  వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ హిట్‌ కాంబో పునరావృతం కానుందని తెలిసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు కోసం రజనీకాంత్‌, మణిరత్నంకు మధ్య చర్చలు జరిగాయని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలిసింది. ఇటీవల రజనీ కాస్త అస్వస్థతకు గురి కావడంతో ఆయనకు చిన్నపాటి సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘వేట్టయన్‌’  విడుదలకు సిద్థమైంది. 

Thalaiva.jpg

లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కూలీ’ చిత్రం ఫైనల్‌ షెడ్యూల్‌లో ఉంది. కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. నాగార్జున, శ్రుతిహాసన్‌, ఉపేంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కొన్నాళ్లుగా విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌కు సంబంధించి రజనీ పాత్ర షూట్‌ ఇప్పటికే పూర్తవగా.. ఇప్పుడు మొత్తం షెడ్యూల్‌ను ముగించారు. ఈ విషయాన్ని శ్రుతిహాసన్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్‌ ఈనెల 15నుంచి చెన్నైలో మొదలు కానుంది. ఇది మొదలైన కొద్ది రోజుల్లోనే రజనీ తిరిగీ సెట్లోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవల చిన్న సర్జరీ జరగడంతో వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. తదుపరి  ‘జైలర్‌ 2’ పట్టాలెక్కేందుకు సిద్థంగా ఉంది. మణిరత్నం ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘థగ్‌ లైఫ్‌’ చేస్తున్నారు. ‘నాయకన్‌’ (1987) విజయం తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న సినిమా ఇది.  

Updated Date - Oct 07 , 2024 | 10:27 AM