The GOAT: విజయ్.. డీ-ఏజింగ్‌పై విమర్శలు మాకు గుణపాఠం
ABN , Publish Date - Aug 20 , 2024 | 07:19 PM
విజయ్‌ను డీ-ఏజింగ్‌లో చూపించడంపై వచ్చిన విమర్శలు తమకు ఒక గుణపాఠం వంటివని ఆ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు అన్నారు.
దళపతి విజయ్ (Thalapathy Vijay), వెంకట్ ప్రభు (Venkat Prabhu)ల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ శనివారం విడుదల చేశారు. విజయ్ సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటించింది. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనుంది.
అయితే దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) మీడియాతో మాట్లాడుతూ.. ‘ది గోట్’(The GOAT)లో చిత్ర కథానాయకుడు విజయ్‌ను డీ-ఏజింగ్‌లో చూపించడంపై వచ్చిన విమర్శలు తమకు ఒక గుణపాఠం వంటివని ఆ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు అన్నారు. డీ-ఏజింగ్‌తో తీసిన ‘స్పార్క్’ పాటను ఇటీవల విడుదల చేయగా, విమర్శలు వచ్చాయి. దీంతో ఆడియన్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని, హీరో కూడా తన అభిప్రాయం అడగగా ఆయన కూడా మంచి సలహా ఇచ్చారన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని సినిమాలో కొన్ని మార్పులు చేశామని, ట్రైలర్‌లో చూసిన లుక్కే ఫైనల్ చేశామని, సినిమాలో కూడా దాన్నే చూపిస్తామన్నారు.. మాకు ఇది ఓ గుణపాఠం వంటింది అని అన్నారు.
అదేవిధంగా సినిమాలోని పాటలు బయట వినేందుకు మరోలా ఉన్నా తెరపై మాత్రం ప్రేక్షకులను ఆలరిస్తాయన్నారు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ అని ఇందు కోసం డీ-ఏజింగ్ టెక్నాలజీ ఉపయోగించామన్నారు. దాని సాయంతోనే విజయ్‌ను కుర్రాడిలా చూపించే ప్రయత్నం చేశామన్నారు. మరో గెటప్పులోనూ ఆయన అలరిస్తాడన్నారు. సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా.. లైలా, స్నేహా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా కల్పాతి అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్, అర్చన కల్పాతి ఈ చిత్రాన్ని నిర్మించారు.