Rohini: అవన్నీ నిరాధార ఆరోపణలే .. ఆ ఇంటర్వ్యూ తొలగించాలి
ABN , Publish Date - Sep 14 , 2024 | 11:03 AM
జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ మాలీవుడ్‌లోనే కాకుండా అన్ని చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ (Hema Committee Report) మాలీవుడ్‌లోనే కాకుండా అన్ని చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రిపోర్ట్ బయటకు వచ్చాక మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇతర పరిశ్రమల్లోనూ వర్క్ ప్లేస్‌లో ఓ మహిళా ఆర్టిస్ట్‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి గొంతెత్తి మాట్లాడుతున్నారు. దీంతో హేమ కమిషన్ తరహాలోనే తమిళ చిత్ర పరిశ్రమలో నడిగర్ సంఘం విశాక కమిటీ సిఫార్సుతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సీనియర్ నటి రోహిణిని (Actress Rohini) అధ్యక్షురాలిగా నియమించారు. దీంతో ఆమెకు పలు ఫిర్యాదులు వస్తున్నాయని ఆమె తాజా ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ఆమె శుక్రవారం డాక్టర్ కాంతరాజ్‌పై (Dr Kantharaj) చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఒక యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ కాంతరాజ్ ఒక సినీ నటీమణులందరూ వ్యభిచారులే అన్నట్లు మాట్లాడారు. నటీమణులు కెమెరామెన్, లైట్‌మెన్, మేకప్‌మెన్, దర్శకుడు అంటూ కోరుకునే వారందరికి కమిట్‌మెంట్ చేసుకుని సినిమాల్లో అవకాశాలు పొందుతున్నట్లు చెప్పి అందరు నటీమణులు అవమానించే విధంగా ఆయన మాట్లాడారని రోహిణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి నిరాధార వ్యాఖ్యలు చేసిన డాక్టర్ కాంతరాజ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ ఇంటర్వ్యూను వెంటనే తొలగించాలని ఆమె పేన్కొన్నారు. దక్షిణాదిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన రోహిణి వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. తాజాగా విడుదలైన 'ఎఆర్‌ఎం', 'మత్తు వదలరా-2' చిత్రాలతో మెప్పించారు.