మహాకాళి చిత్రంలో అక్షయ్‌ ఖన్నా

ABN , Publish Date - Apr 06 , 2025 | 03:39 AM

‘హను-మాన్‌’ చిత్రం ఘన విజయం తర్వాత ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనియర్స్‌ నుంచి వస్తున్న చిత్రం ‘మహాకాళి’. ఆర్‌కేడీ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని...

‘హను-మాన్‌’ చిత్రం ఘన విజయం తర్వాత ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనియర్స్‌ నుంచి వస్తున్న చిత్రం ‘మహాకాళి’. ఆర్‌కేడీ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో పౌరాణిక ఇతివృత్తంతో సూపర్‌హీరో జానర్‌ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా చిత్రబృందం ఆసక్తికర అప్డేట్‌ను పంచుకుంది. ‘ఛావా’ చిత్రంలో ఔరంగజేబ్‌గా పాత్రోచిత నటనతో ఆకట్టుకున్నారు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ఖన్నా. ఇప్పుడు ఆయన ‘మహాకాళి’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్‌ శనివారం ప్రకటించారు.

Updated Date - Apr 06 , 2025 | 03:39 AM