Kalki 2898AD Twitter REVIEW: మాట‌ల్లేవ్.. గూస్ బంప్సే! ట్విట్ట‌ర్ రివ్యూ

ABN , Publish Date - Jun 27 , 2024 | 08:49 AM

మొత్తానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప్ర‌భాస్ క‌ల్కి 2898AD చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే చాలామంది సినిమాను వీక్షించి త‌మ అభిప్రాయాల‌ను, రివ్యూల‌ను ఇస్తున్నారు. సినిమా గురించి నెటిజ‌న్లు ఏమంటున్నారంటే..

Kalki 2898AD Twitter REVIEW: మాట‌ల్లేవ్.. గూస్ బంప్సే! ట్విట్ట‌ర్ రివ్యూ
kalki

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప్ర‌భాస్ (Prabhas) క‌ల్కి (Kalki 2898AD) చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 10 వేల‌కు పైగా స్క్రీన్ల‌లో గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. చాలా ప్రాంతాల్లో ప్ర‌త్యేక అనుమ‌తితో 6 షోలు కూడా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రెండో ఆట కూడా ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో రిలీజ్‌కు ముందు నుంచే సంచ‌ల‌నాలు, రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమాను ఇప్ప‌టికే చాలా మంది వీక్షించి త‌మ అభిప్రాయాలు తెలుపుతూ రివ్యూల‌ను ఇస్తున్నారు.

Kalki.jpg

సినిమా గురించి నెటిజ‌న్లు ఏమంటున్నారంటే.. సినిమా ఆరంభం నుంచే ప్ర‌త్యేకంగా ఉంద‌ని, అమితాబ్ ఎంట్రీ, ఎలివేష‌న్స్ ఆ త‌ర్వాత ప్ర‌భాస్ ఎంట్రీతో సినిమా అమాంతం పీక్స్‌కు వెళ్లిందంటున్నారు. ముఖ్యంగా సినిమాలోని విజువ‌ల్స్ హాలీవుడ్ చిత్రాల‌ను త‌ల‌ద‌న్నేలా ఉన్నాయ‌ని, మార్వెల్‌, డ్యూన్ స్థాయిలో ఉన్నాయ‌ని కామెంట్లు చేస్తున్నారు. మ‌ధ్య‌లో రాంగోపాల్ వ‌ర్మ‌, విజ‌య్ దేవ‌రకొండ స‌ర్‌ప్రైజింగ్ ఎంట్రీస్ సినిమాను హైలెట్ చేసేలా ఉన్నాయంటున్నారు.


GRC8BLFW8AALW1u.jpeg

సినిమా మెయిన్ మూడు కాంప్లెక్స్‌ల చుట్టూ తిరుగుతుంద‌ని, భార‌తం, క‌ల్కిల చ‌రిత్ర‌ గురించి అద్భుతంగా వివ‌రించారంటున్నారు. భూమి నాశ‌న‌మై ఉండ‌డం, శంబాలాలో శ‌ర‌ణార్దులు ఉండ‌గా క‌మ‌ల్ అధీనంలో కాంప్లెక్స్ ఉంటూ ప్ర‌పంచాన్ని శాసించ‌డం అనే క‌థ వండ‌ర్‌గా ఉంద‌ని పేర్కొంటున్నారు. మఅమితాబ్‌, దీపికా,క‌మ‌ల్ పాత్ర‌లు చాలా హైలెట్‌గా ఉన్నాయి.. వాటికి వాళ్లు క‌రెక్టుగా సెట్ అయ్యార‌ని, అమితాబ్ యాక్ష‌న్ స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు.

GQ_KgHVbAAAo6PN.jpeg

ఇక స‌కండాఫ్ అయితే ప్ర‌తి ఒక్క‌రికీ గూస్‌బ‌మ్స్ తెప్పించేలా ఉంద‌ని, ప్ర‌తి ప్ర‌భాస్ ఫ్యాన్ కాల‌ర్ ఎగుర‌వేస్తాడ‌ని ఓ రేంజ్‌లో నెటిజ‌న్లు ట్లీట్లు పెడుతున్నారు. ఇంకా సినిమాకు మ్యూజిక్ మాత్రం ఔట్ స్టాండింగ్‌గా ఉండి మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లింద‌ని అంటున్నారు. ప్ర‌ల‌తి ఇండియ‌న్ కంప‌ల్స‌రీగా చూడాల్సిన సినిమా అని, మ‌న తెలుగు సినిమా స్టామినాను బాహుబ‌లిని మించి క‌ల్కి Kalki2898AD ప్ర‌పంచానికి తెలియ‌జేస్తుంద‌ని అంటున్నారు.నాగ్ అశ్విన్ (Nag Ashwin)కు హ్య‌ట్సాప్ అంటూ అభినంద‌న‌లు తెలుపుతున్నారు.


సినిమా అక్క‌డ‌క్క‌డ స్లో అనిపించినా విజువ‌ల్స్ క‌వ‌ర్ చేస్తాయ‌ని, అశ్వ‌థ్దామ‌, అర్జున‌, క‌ర్ణుడి స్టోరీ అర్ధం కావ‌డం టైం ప‌డుతుంద‌ని అంటున్నారు.

Updated Date - Jun 27 , 2024 | 10:57 AM