Sapthagiri: మాతృవియోగం
ABN , Publish Date - Apr 09 , 2025 | 10:12 AM
ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి తల్లి చిట్టెమ్మ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. బుధవారం తిరుపతిలో అంత్యక్రియలు జరుగనున్నాయి.
ప్రముఖ హాస్యనటుడు, కథానాయకుడు సప్తగిరి (Sapthagiri) ఇంట విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతని తల్లి చిట్టెమ్మ మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని సప్తగిరి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. చిట్టెమ్మ అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన సప్తగిరి చిత్రసీమలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టి, ఆ పైన కమెడియన్ గా మారారు. పలు చిత్రాలలో తనదైన హాస్యాన్ని పండించిన సప్తగిరి 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' మూవీతో హీరోగా ఎదిగారు. ఆ తర్వాత ఇటు హీరోగా, అటు కమెడియన్ గా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలే ఆయన హీరోగా నటించిన 'పెళ్లి కాని ప్రసాద్' (Pelli kaani Prasad) చిత్రం విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో దీనికి ఆదరణ దక్కలేదు. సప్తగిరి తల్లి మరణవార్త తెలిసిన వెంటనే సినీ రంగానికి చెందిన పలువురు సప్తగిరికి సానుభూతిని తెలిపారు.