‘టిల్లూ’కు మించిన వినోదంతో వస్తున్నాం
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:44 AM
‘‘బొమ్మరిల్లు, పరుగు’ లాంటి హిట్ చిత్రాల కోవలోనే భాస్కర్ గారు దర్శకత్వం వహించిన ‘జాక్’ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఆయన 24 గంటలూ ఈ సినిమా గురించే ఆలోచించారు. ‘టిల్లూతో నువ్వు క్రియేట్ చేసిన...
‘‘బొమ్మరిల్లు, పరుగు’ లాంటి హిట్ చిత్రాల కోవలోనే భాస్కర్ గారు దర్శకత్వం వహించిన ‘జాక్’ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఆయన 24 గంటలూ ఈ సినిమా గురించే ఆలోచించారు. ‘టిల్లూతో నువ్వు క్రియేట్ చేసిన ఇమేజ్ ఈ చిత్రంలోనూ ఏమాత్రం తగ్గకూడదు’ అని అనేవారు. ఆయన చెప్పినట్లు నా గత చిత్రాలకు మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ చిత్రంతో ఇవ్వబోతున్నాం’’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ చెప్పారు. ఆయన కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘టిల్లూ స్క్వేర్’ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకొని చేసిన సినిమా ఇది. భాస్కర్ గారి విజన్‌లో హీరోగా నన్ను చూసుకోవడం ఆనందాన్నిచ్చింది’’ అని అన్నారు. బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ ‘ఇది మనందరి కథ. ఒక శిలలో ఉండే శక్తి ఏంటో మీరు ఈ సినిమాలో చూస్తారు. నటిగా వైష్ణవి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంది. సిద్ధు ప్రతిభావంతుడైన నటుడు. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ప్రసాద్ గారితో కలసి పనిచేయడం కొత్త ఉత్సాహాన్నిచ్చింది’ అని చెప్పారు. బీవీఎ్‌సఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ‘సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకాధరణ దక్కుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘‘టిల్లూ స్క్వేర్‌తో పోల్చితే జాక్‌లో పదిరెట్ల వినోదం ఉంటుంది. హ్యాపీగా నవ్వుకోవడానికి ఈ సినిమాకు వెళ్లండి’’ అని నిర్మాత నాగవంశీ చెప్పారు.