Devara: యు.ఎస్‌లో ప్రీ సేల్స్‌.. రచ్చరంబోలా..

ABN , Publish Date - Sep 06 , 2024 | 11:02 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలియంది కాదు. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెంచుకున్న ఈ సినిమాకు.. ఓవ‌ర్‌సీస్‌లో సైతం వావ్ అనేలా ప్రీ సేల్స్ మొదలయ్యాయి.

Devara Movie Still

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ (Devara). కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలియంది కాదు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెంచుకున్న ఈ సినిమాకు.. ఓవ‌ర్‌సీస్‌లో సైతం వావ్ అనేలా ప్రీ సేల్స్ మొదలయ్యాయి.

Also Read- Tollywood - Vinayaka Chavithi: దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. కరుణించయ్యా దేవా..

ఈ చిత్రాన్ని అమెరికాలోనే ఎప్పుడు ఎవ‌రూ చేయ‌నంత గొప్ప‌గా రిలీజ్ చేయ‌టానికి ప్ర‌త్యాంగిర సినిమాస్ స‌న్నాహాలు చేస్తోంది. రీసెంట్‌గానే ప్రీ బుకింగ్స్‌ను యు.ఎస్‌లో ఓపెన్ చేయగా అక్కడ రచ్చరంబోలా అనేలా సెన్సేషన్ క్రియేట్ అవుతోంది. ఇప్ప‌టికే ప్రీ సేల్స్ ఐదు ల‌క్ష‌ల డాల‌ర్స్‌ను దాటేయ‌టం విశేషం. సినిమాపై ఉన్న బ‌జ్‌, ఊపు చూస్తుంటే ఇంకా ఈ లెక్క రోజు రోజుకీ పెరుగుతోందే కానీ త‌గ్గ‌దనేలా అనిపిస్తోంది. ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమాటిక్ ఫీల్‌ను తెర‌పై ఎంజాయ్ చేద్దామా అని ఎదురు చూస్తున్నారు.


Devara.jpg

అభిమానులు టికెట్స్ కోసం ఎగ‌బ‌డుతున్న తీరు చూస్తుంటే ‘దేవ‌ర’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచలనాలు క్రియేట్ చేయడం కాయమని అనిపిస్తోంది. అభిమానుల స్పీడ్ చూస్తుంటే యు.ఎస్‌లో ‘దేవ‌ర’ రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ క‌లెక్ష‌న్స్ రాబట్టే అవకాశం అయితే లేకపోలేదు. త్వ‌ర‌లోనే రాబోతున్న ఈ మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌తో ఈ అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు రీచ్ అవుతాయ‌న‌టంలో అస్సలు సందేహమే లేదంటున్నారు మేకర్స్. 2024లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఈ యాక్ష‌న్ చిత్రంలో భైరా అనే పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్ హై యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. మొదటి భాగం ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Tarak and Janhvi.jpg

Read Latest Cinema News

Updated Date - Sep 06 , 2024 | 11:02 PM

Devara : సెకెండ్‌ సింగిల్‌..  నీ కోసం వయసు వాకిలి కాసా!

Devara : సూపర్‌ ఎలివేషన్స్‌తో ‘ఫియర్‌’

Devara: భయానికి మరో పేరు ‘దేవర’.. అదిరిన అప్డేట్

Devara - Dop Ratnavelu: ఎన్టీఆర్‌ గ్రేస్‌, స్టైల్‌ మామూలుగా లేవు..  పూనకాలు పక్కా

Devara BTS: 'ఎవరీ దేవత'.. అంటూ బీటీఎస్‌ వీడియోపై కామెంట్లు!